కేబినెట్ భేటీ తర్వాత రైతులకు గుడ్ న్యూస్

కేబినేట్ సమావేశం తర్వాత రైతులకు శుభవార్త చెబుతామన్నారు రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. లోటు బడ్జెట్ లోనూ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత MLA క్యాంపు ఆఫీసులో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 80 లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకున్నారని తెలిపారు. ఇప్పటికే 30 లక్షల మంది లబ్ధిదారులను యాప్ తో సర్వే చేశామన్నారు.

జనవరి 4న  సాయంత్రం  సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మొత్తం 18 అంశాలతో కేబినెట్ అజెండా ఉన్నట్టు సమాచారం. రైతు భరోసాకు సంబంధించిన విధివిధానాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని సబ్ కమిటీ చేసిన సిఫార్సులపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.