మెదక్ జిల్లాను ప్రగతి పథంలో ముందు వరుసలో ఉంచాలి : మంత్రి దామోదర రాజనర్సింహా

మెదక్ జిల్లాను ప్రగతి పథంలో ముందు వరుసలో  ఉంచాలన్నారు మంత్రి దామోదర రాజనర్సింహ. జిల్లా అభివృద్ధి, వర్షాల నష్టాలపై కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు.   మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు రోహిత్, సునీతా లక్ష్మారెడ్డి, ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. 

ఈ సందర్బంగా.. అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని చెప్పారు దామోదర రాజనర్సింహా. ప్రతి విద్యార్థికి , జబ్బు పడ్డ వ్యక్తికి నాణ్యమైన ఉచిత విద్య వైద్యం అందించడమే ధ్యేయమన్నారు. అక్షయ పాత్ర అదనపు వంట గదిని మెదక్ జిల్లా కేంద్రంలో  ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నం చేయాలన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలలో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు మంత్రి.