మంత్రులను కలిసిన జడ్పీ చైర్​ పర్సన్​ సరిత

అయిజ, వెలుగు: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ, గద్వాల ఇన్​చార్జి మంత్రి దామోదర రాజా నరసింహను కాంగ్రెస్  గద్వాల ఇన్​చార్జి, జడ్పీ చైర్ పర్సన్ సరిత, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ హైదరాబాదులో మంగళవారం కలిశారు. నడిగడ్డ లోని అలంపూర్, గద్వాల నియోజకవర్గాల్లో అభివృద్ధి అంశాల పై మంత్రితో చర్చించారు. అలంపూర్ నియోజకవర్గంలో   రిజర్వాయర్లు, అలంపూర్ చౌరస్తాలోని వంద పడకల ఆసుపత్రిలో సిబ్బంది నియామకం, గద్వాల జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ ప్రారంభం, తదితర విషయాలు  మంత్రికి వివరించారు. వాటిని త్వరలో పూర్తిచేసి జిల్లా అభివృద్ధికి సహకరించాలని కోరారు.  

మంత్రి సీతక్కను కలిసిన జడ్పీ చైర్​పర్సన్

గద్వాల, వెలుగు: పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను గద్వాల జడ్పీ చైర్​పర్సన్​ సరిత మంగళవారం హైదరాబాద్​లో కలిశారు.  ఈ సందర్భంగా గద్వాల అభివృద్ధికి ఫండ్స్ ఇవ్వాలని వినతి పత్రం అందించారు. పంచాయతీలలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కొత్త పంచాయతీ బిల్డింగ్స్​కు  ఫండ్స్ ఇవ్వాలన్నారు. మంత్రి సానుకూలంగా స్పందించి ఫండ్స్ రిలీజ్ చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందని జెడ్పీ చైర్మన్ తెలిపారు.