రైతులకు ఇబ్బంది కలగొద్దు

  • ప్రత్యేక అధికారి హరిచందన

నర్సాపూర్, కౌడిపల్లి వెలుగు: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో  రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఉమ్మడి మెదక్ జిల్లా ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రత్యేక అధికారి దాసరి హరిచందన అధికారులను ఆదేశించారు. సోమవారం కౌడిపల్లి మండలం నాగసాన్ పల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం వడ్ల కొనుగోళ్లు ఎలా జరుగుతున్నాయని రైతులను అడిగి తెలుసుకున్నారు. 

అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలకు చిన్న రైతుల వడ్లు మాత్రమే వచ్చాయని పెద్ద రైతులవి ఇంకా రాలేదన్నారు. రైస్ మిల్లు అలాట్​మెంట్​అయిందా లేదా అని జేసీ నగేశ్ ను అడిగారు.  అంతకుముందు నర్సాపూర్ ఆర్డీవో ఆఫీసులో అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించి రైతుల సమస్యలపై చర్చించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నగేశ్, అడిషనల్ కలెక్టర్ మాధురి, డీఆర్డీవో జ్యోతి, ఆర్డీవో మైపాల్, ఆంజనేయులు, ఆర్ఐ శ్రీహరి, ఆఫీసర్లు,  రైతులు  పాల్గొన్నారు.