జూన్​ 1న మేషరాశిలోకి కుజుడు.. ఏ రాశి వారికి ఎలా ఉందంటే...

 

కుజుడు త్వరలో తన రాశి చక్రాన్ని మార్చుకోబోతున్నాడు. కుజుడి సంచారం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి రానుంది. అంగారకుడి ప్రభావంతో వారు సంపన్నులు కాబోతున్నారు. అంగారకుడిని అన్ని గ్రహాలకు అధిపతిగా భావిస్తారు. ఇప్పుడు మీనరాశిలో ఉన్న కుజుడు మరికొద్ది రోజుల్లో  అంటే జూన్​ 1 వ తేదీన మేషరాశిలో ప్రవేశిస్తాడు. అంగారకుడు మేష రాశికి అధిపతి. అయితే అటువంటి పరిస్థితిలో కుజుడి సంచారం కూడా ఆసక్తికరంగా ఉండబోతోంది. జూన్ 1 నుంచి మేష రాశిలో కుజుడు ప్రవేశించనున్నాడు. జూలై 12 వరకు కుజుడు మేషరాశిలో ఉంటాడు. మేషం, వృశ్చిక రాశులకు కుజుడు అధిపతిగా వ్యవహరిస్తాడు. కుజ సంచారం కారణంగా 41 రోజుల్లో కొన్ని రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. అవి ఏ రాశులో ఇప్పుడు తెలుసుకుందాం .

మేషరాశి: మేష రాశిలో కుజుడు సంచరించడం వల్ల ఈ రాశివారికి అదృష్టం కలసివస్తుంది. పాత పెట్టుబడులతో మంచి లాభాలు కలుగుతాయి. వృత్తి పనిలో కూడా ప్రశంసలు అందుకుంటారు. వారి శక్తి సామర్థ్యాల కారణంగా గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో శాంతి, సంతోషాలు నెలకొంటాయి. ప్రయాణాల వల్ల కూడా లాభాలు పొందే అవకాశముంది. మీరు చేసిన పనికి ప్రశంసలు అందుతాయి. ఉద్యోగ వ్యాపారులకు ఇది అనుకూలమైన సమయం. ఆర్థికంగా అభివృద్ది చెందుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. 

వృషభరాశి: మేష రాశిలో కుజ సంచారం వల్ల వృషభ రాశి వారు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలసి. వ్యాపారాల్లో ఏ పెట్టుబడులు పెట్టిన కలిసి రాదు. కుటుంబ సభ్యులతో మంచిగా ఉండండి . లేదంటే వారి నుంచి విడిపోయే పరిస్థితి రావచ్చు. ఆర్ధిక సమస్యలు ఎక్కువవుతాయి. తొందరపడి ఈ నిర్ణయాలు తీసుకోకకండి.  ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. ప్రయాణాలు చేసే టప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో వ్యాపారాలు గురించి ఆలోచించండి. ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోకపోతే అనారోగ్య బాధలు తప్పవు.

మిథున రాశి: ఈ రాశి వారికి కుజుడు మేషరాశిలో  సంచారం వలన  ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. అంతే కాకుండా గౌరవం పెరుగుతుంది. నూతన వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కెరీర్ కు సంబంధించిన నిర్ణయాలను తీసుకొని ధైర్యంగా అడుగు ముందుకు వేస్తారు. అయితే ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. 

కర్కాటక రాశి :   మేషరాశిలో కుజ గ్రహం సంచారం వలన కర్కాటక వారికి   ప్రయోజనకరంగా ఉంటుంది . ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు శుభ వార్తలు వింటారు.  ఉద్యోగస్తులకు ప్రమోషన్​ లభిస్తుంది. వ్యాపారస్తులకు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే కొత్త ఆదాయ వనరులు సృష్టించబడతాయి. మీ డబ్బు ఎక్కడైనా నిలిచిపోయి ఉంటే, మీరు దానిని కూడా తిరిగి పొందవచ్చు. అయితే వాహనాల్లో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. 

సింహరాశి: కుజుడు మేషరాశిలో సంచరించే సమయంలో ఆదాయం పెరగడం వల్ల  డబ్బుకు సంబంధించిన సమస్యలను అధిగమిస్తారు. జీవిత భాగస్వామితో కూడా ఆనందంగా గడుపుతారు. వీరి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. విద్యా రంగంతో సంబంధం ఉన్నవారికి ఈ సమయం చాలా మంచిది. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు విదేశాలకు ప్రయాణించే సమయం ఆసన్నమయింది.  కొంత కాలం కుటుంబానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. 

కన్యా రాశి: ఈ సమయంలో కన్యారాశి వారు ఉద్యోగంలో పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి. నూతన పనులు ప్రారంభిస్తారు. వ్యాపారులకు కూడా లాభాలు అందుతాయి. ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశముంది. విద్యా రంగంతో సంబంధం ఉన్నవారికి ఈ సమయం శుభదాయకం అని చెప్పవచ్చు.

తులారాశి: కుజుడు రాశిలో మార్పు తుల రాశి వారికి చాలా ఫలప్రదంగా ఉంటుంది. ధన ప్రవాహం పెరుగుతుంది, ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది. ఉద్యోగస్తులకు అధికారులతో సత్సంబంధాలు ఉంటాయి, పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. వైవాహిక జీవితంలో సంతోషం పెరుగుతుంది. బంధువులతో సత్సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. వ్యాపారంలో లాభం సాధారణంగా ఉంటుంది, కానీ వ్యాపారం విస్తరిస్తుంది. విద్యార్థుల వృత్తిలో పురోగతి ఉంటుంది, సీనియర్ స్నేహితులు ప్రాజెక్ట్‌లలో సహాయపడతారు.

వృశ్చికరాశి: కుజుడు రాశిలో మార్పు వృశ్చిక రాశి వారికి చాలా ప్రయోజనకరమైన యోగాన్ని సృష్టిస్తోంది. వృత్తి జీవితంలో మంచి పురోగతి ఉంటుంది. సామాజిక గౌరవం పెరుగుతుంది. మీరు కుటుంబంలోని పెద్దల నుండి ఆప్యాయత, మద్దతు పొందుతారు. వ్యాపారంలో విజయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక శ్రేయస్సు ఉంటుంది, జీవన ప్రమాణంలో గణనీయమైన మెరుగుదల ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ప్రేమ జీవితంలో శృంగారం పెరుగుతుంది. ఉద్యోగాలలో మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఇది లాభదాయకంగా ఉంటుంది.

ధనస్సురాశి: కుజుడు రాశి మార్పు చెందడం వల్ల ధనస్సు రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ధనం వచ్చే అవకాశాలు వీరికి ఎక్కువగా ఉన్నాయి. వారి పనులకు సంబంధించి విదేశాలకు కూడా వెళ్లాల్సి వస్తుంది. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కూడా నెలకొంటుంది.

మకరరాశి: మేషరాశిలో కుజుడు సంచారం ఈ రాశి వారికి చాలా ఫలప్రదంగా ఉంటుంది. ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. ధార్మిక-సామాజిక కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. కొన్ని కొత్త పనులు ప్రారంభించగలరు. మీరు మీ తల్లిదండ్రుల నుండి ఆశీర్వాదాలు , మద్దతు పొందుతారు. మీ పని ఆధారంగా మీకు కొత్త గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. అభివృద్ధి చెందుతాయి. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. పెట్టుబడి నుండి బలమైన లాభాలు ఉన్నాయి.

కుంభరాశి :  కుజుడు మేషరాశిలో సంచరించే సమయంలో  కుంభ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ధన ప్రవాహం పెరుగుతుంది, ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది. ఉద్యోగోన్నతులు పై అధికారులతో సత్సంబంధాలు కలిగి ఉంటారు, పదోన్నతి పొందే అవకాశం ఉంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. వైవాహిక జీవితంలో సంతోషం పెరుగుతుంది. బంధువులతో సత్సంబంధాలు మెరుగ్గా ఉంటాయి

మీనరాశి: కుజుడి సంచారం మీన రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో వీరు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ధార్మిక విషయాల పట్ల ఆసక్తి చూపిస్తారు. మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. పని, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యం పాటించాలి. ఎవరితోనూ వాదించకండి.  తక్కువ మాట్లాడండి.  ఆర్థిక విషయాల్లో ఎలాంటి మార్పులు లేక పోయినా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది