లగచర్ల రైతులకు బీజేపీ అండగా ఉంటుంది

  • మహబూబ్​నగర్ ఎంపీ డీకే అరుణ భరోసా

కొడంగల్, వెలుగు: లగచర్ల రైతులకు బీజేపీ అండగా ఉంటుందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ భరోసా ఇచ్చారు. సోమవారం లగచర్లలో పర్యటించిన ఆమె రైతులను పరామర్శించారు. ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా పోరాడిన రైతులను అరెస్టు చేయడంపై ఆమె విచారం వ్యక్తం చేశారు. రైతులకు కంపెనీలు కాదు భూములే ముఖ్యమని ఇప్పటికైనా ప్రభుత్వం అర్థం చేసుకోవాలని తెలిపారు. 

ఫార్మా కంపెనీలతో ఇక్కడి ప్రజలకు ఒరిగెదేమి లేదని చెప్పారు. రైతులపై లాఠీ చార్జీ చేయడం క్షమించరాని నేరమని పేర్కొన్నారు.  ఓ ప్రైవేటు కంపెనీ కోసం అమాయక రైతులను ఇబ్బంది పెట్టడం సిగ్గుచేటన్నారు. ఈ ప్రాంత ఎంపీగా రైతులను పరామర్శించేందుకు వస్తే అడ్డుకుని తనను అరెస్ట్​ చేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.