IND vs NZ 3rd Test: మ్యాచ్‌కు స్పైడర్‌క్యామ్ అంతరాయం.. ముందుగానే లంచ్‌కు

ముంబై వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టుకు చిన్న అంతరాయం కలిగింది. సాంకేతిక లోపం కారణంగా  స్పైడర్‌క్యామ్ వచ్చి గ్రౌండ్ లో వాలింది. ఎంత సేపు చూసిన స్పైడర్‌క్యామ్ పైకి వెళ్ళలేదు. ఐదు నిమిషాల పాటు అంతరాయం కలిగించింది. లంచ్ కు ముందు సమయంలో ఇలా జరగడంతో అంపైర్లు ఆటగాళ్లకు లంచ్ బ్రేక్ ఇచ్చారు. దీంతో ఒక ఐదు నిమిషాలు ముందుగానే ఆటగాళ్లు లంచ్ కు వెళ్లారు. 

స్పైడర్‌క్యామ్ మ్యాచ్ కు అంతరాయం కలిగించడం ఇదే తొలిసారి కాదు. 2021 లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ముంబై వేదికగా జరిగిన మ్యాచ్ లో అంతరాయం కలిగించడంతో 15 నిమిషాలు ముందే టీ బ్రేక్ ప్రకటించారు. ఆ టెస్ట్ కూడా ముంబైలోని వాంఖడే స్టేడియంలోనే జరగడం విశేషం. ఈ మ్యాచ్ విషయానికి వస్తే రెండో రోజు లంచ్ విరామ సమయానికి భారత్ 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. క్రీజ్ లో గిల్ (70), జడేజా (10) ఉన్నారు. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 40 పరుగులు వెనకబడి ఉంది. న్యూజిలాండ్ తొలి  ఇన్నింగ్స్ లో 235 పరుగులకు ఆలౌట్ అయింది.     

Also Read : పంత్, గిల్ మెరుపులు