ప్రభుత్వ బడి కుల మతాలు లేని దేవాలయం

  • రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ

పానుగల్, వెలుగు:  అక్షరం ఒక ఆయుధం. ప్రభుత్వ బడి కుల మతాలు లేని దేవాలయం. నేను చదువుకోలేదు. అక్షరమే నా అమ్మ, నాన్న..” అని తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ అన్నారు.  బుధవారం వనపర్తి జిల్లా పానుగల్​జడ్పీ హైస్కూల్​లో ‘ఫ్లయింగ్ బర్డ్స్’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ప్రభుత్వ బడుల్లో చదువుకున్న పిల్లలే రచయితలని పేర్కొన్నారు. విద్యార్థులు మన ఆస్తి అక్షరం.. పిల్లలతో కలిసి మెలిసి లేనివాడు ఉపాధ్యాయుడే కాదన్నారు.

అక్షరం మరణం లేనిదని.. విద్యార్థులకు   అక్షరాలే ఒక సంజీవిని పాత్ర అవుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫ్లయింగ్ బర్డ్స్ రచయిత, టీచర్​కిరణ్ కుమార్, కవి జనజాల, ఎంఈవో శ్రీనివాస్, కరస్పాండెంట్ కాకం ఆంజనేయులు, గాయకుడు సత్తార్, ఎంపీడీవో గోవిందరావు, టీచర్లు 
తదితరులు పాల్గొన్నారు.