ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోడీ, బాలీవుడ్ నటి సుస్మితా సేన్ పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని లలిత్ మోడీ ట్విట్టర్ వేదకగా తెలిపాడు. ఈ ట్వీట్‌లో మాల్దీవులు, సార్డియానా పర్యటనను ముగించుకుని ఇప్పుడే లండన్ తిరిగి వచ్చామన్న లలిత్.. ఈ టూర్‌కు పలు కుటుంబాలతో కలిసి వెళ్లానని చెప్పాడు. అయితే ఆ కుటుంబాల పేర్లు చెప్పనని అన్నాడు. సుస్మితా సేన్‌ను తన బెటర్ హాఫ్ గా పేర్కొన్న లలిత్ .. ఆమెతో జీవితంలో కొత్త అధ్యాయం మొదలైందని తెలిపాడు.
Former IPL chairman Lalit Modi announces his wedding with actor Sushmita Sen. pic.twitter.com/rzvEKBmeNR
— ANI (@ANI) July 14, 2022
ఇక మరో ట్వీట్ లో ప్రస్తుతం ఇద్దరం డేటింగ్ చేస్తున్నామని, ఏదో ఒక రోజు పెళ్లి చేసుకుంటామని తెలుపుతూ మరో ట్వీట్ చేశాడు. ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫోటోలను లలిత్ షేర్ చేయగా ఇవి క్షణాల్లో వైరల్ గా మారాయి. కాగా పన్ను ఎగవేత కేసులో ఇండియాను విడిచిపెట్టిన లలిత్ మోడీ 2010 నుండి లండన్‌లోనే ఉంటున్నాడు. అటు సుస్మితా సేన్‌కు అలీసా, రెనీ అనే ఇద్దరు దత్తత తీసుకున్న పిల్లలున్నారు.
"Just for clarity. Not married - just dating each other. That too it will happen one day," Lalit Modi posts a second tweet. pic.twitter.com/0uA5Dj0CJx
— ANI (@ANI) July 14, 2022
