2023 జూన్ 14 ప్రాముఖ్యత ఏంటో తెలుసా..

2023 జూన్ 14  ప్రాముఖ్యత ఏంటో తెలుసా..

 హిందూ ఆచారాల ప్రకారం ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఈ విధంగా సంవత్సరంలో వచ్చే ఏకాదశులన్నింటిని విష్ణుమూర్తికి అంకితం చేస్తారు.కానీ జ్యేష్ట మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి అన్నిటికన్నా ఎంతో ప్రత్యేకమైనది.ఈ ఏకాదశిని యోగిని ఏకాదశి అని పిలుస్తారు. అసలు యోగిని ఏకాదశి అంటే ఏమిటి ఏకాదశి రోజు( జూన్ 14) ఏ విధంగా పూజ చేయాలి.ఈ ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం

యోగిని ఏకాదశి వ్రత ప్రాముఖ్యత

నిర్జల ఏకాదశి తరువాత, దేవశయని ఏకాదశికి ముందు వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు. హిందూమతం విశ్వాసాల ప్రకారం యోగిని ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే సకల పాపాలు తొలగిపోయి జీవితంలో సుఖసంతోషాలు, సౌభాగ్యాలు కలుగుతాయి. యోగిని ఏకాదశి నాడు ఉపవాసం ఉన్న భక్తుడు స్వర్గలోక ప్రాప్తి పొందుతాడు. యోగిని ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వల్ల 88 వేల మంది బ్రాహ్మణులకు అన్నదానం చేయడంతో సమానమని విశ్వాసం.

యోగిని ఏకాదశి శుభ ముహూర్తం

ఏకాదశి తిథి ప్రారంభం: జూన్ 13, 2023 ఉదయం 9.28 గంటలకు
ఏకాదశి తిథి సమాప్తం: జూన్ 14, 2023 ఉదయం 8.48 గంటలకు.
అయితే సాధారణంగా సూర్యోదయాన ఏ తిథి ఉంటుందో ఆ రోజున ఆ తిథిని పరిగణనలోకి తీసుకుంటారు. ఆ లెక్కన యోగిని ఏకాదశి జూన్ 14, బుధవారం రోజు జరుపుకుంటారు.

యోగిని ఏకాదశి పూజ

ఉదయాన్నే నిద్ర లేచి కాలకృత్యాలు పూర్తిచేసుకోవాలి. పూజామందిరంలో దీపం వెలిగించాలి. గంగా జలాలతో విష్ణుమూర్తిని ఆరాధించాలి. పూలు, తులసీ దళాలు సమర్పించాలి. నైవేద్యంలో తప్పనిసరిగా తులసీ దళాలను ఉంచాలి. ఆ తరువాత ఉపవాస దీక్ష ప్రారంభించాలి. మరుసటి రోజు సూర్యోదయం వరకు ఈ దీక్షను కొనసాగించాలి.

యోగిని ఏకాదశి ఉపవాసం జూన్14న శ్రీమహావిష్ణువును పూజిస్తే మోక్షప్రాప్తి కలుగుతుంది. అందుకే ప్రత్యేకించి ఈ రోజు కొన్ని పరిహారాలు చేయడం వల్ల మీ సంపద, ఆనందం ,శ్రేయస్సు పెరుగుతుంది.  ఈ రోజున శ్రీ హరివిష్ణువును క్రమపద్ధతిలో పూజించి, ఉపవాసం ఉండి మోక్షాన్ని అందించాలని కోరుకొంటారు. యోగినీ ఏకాదశి వ్రతం పుణ్య ప్రభావం వల్ల పాపాలు, దుఃఖాలు తొలగిపోతాయి. మరణానంతరం స్వర్గంలో స్థానం లభిస్తుంది. ప్రాపంచిక జీవితంలో ఒక వ్యక్తి తన సంపద, ఆనందం, శ్రేయస్సు పెరుగుతుందని, కోరికలు నెరవేరాలని కోరుకుంటారు. తద్వారా అతని జీవితం ఏ లోటూ లేకుండా కొనసాగుతుందని పురాణాలు చెబుతున్నాయి.