వారంలో ఒకరోజు వెహికల్ వాడొద్దు

వారంలో ఒకరోజు వెహికల్ వాడొద్దు

న్యూఢిల్లీ: వారంలో కనీసం ఒక రోజైనా బండ్లు వాడొద్దని ఢిల్లీ ప్రజలకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. ఆ విధంగా పొల్యూషన్ కంట్రోల్​కు సాయపడాలని కోరారు. ఆ రోజు ప్రజలు పబ్లిక్ ట్రాన్స్ పోర్టు ఉపయోగించుకోవాలన్నారు. అలాగే, సిగ్నల్స్ వద్ద రెడ్​లైట్ పడినప్పుడు వెహికల్స్ ఇంజన్ ఆఫ్ చేయాలని సూచించారు. దాంతో ఢిల్లీలో 20 శాతం దాకా పొల్యూషన్ తగ్గుతుందని, రూ.250 కోట్లు ఆదా అవుతాయని కేజ్రీవాల్ మంగళవారం ట్వీట్ చేశారు. సిటీలో ఎక్కడైనా ఎవరైనా చెత్తను తగలబెడుతున్నట్లు తెలిస్తే వెంటనే ప్రభుత్వానికి తెలియజేయాలని, వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే ‘రెడ్ లైట్ ఆన్.. వెహికల్ ఆఫ్’ ప్రచారంతో సహా.. ప్రతి ఒక్కరూ ఈ మూడు బాధ్యతలు తీసుకుని, సిటీలో పొల్యూషన్ తగ్గించేందుకు సాయపడాలని కేజ్రీవాల్ కోరారు.