కేసీఆర్‌‌‌‌ కనిపించట్లేదు.. ఆచూకీ కనిపెట్టండి

గజ్వేల్‌‌‌‌ పోలీసులకు కాంగ్రెస్‌‌‌‌ నాయకుల ఫిర్యాదు

గజ్వేల్, వెలుగు: ‘గజ్వేల్‌‌‌‌ ఎమ్మెల్యే కేసీఆర్‌‌‌‌ కనిపించడం లేదు.. ఆయన ఆచూకీ కనిపెట్టండి’ అంటూ పీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్‌‌‌‌ ఆదివారం గజ్వేల్‌‌‌‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌‌‌‌ గెలిచి 10 నెలలు అవుతున్నా ఇప్పటికీ నియోజకవర్గంలో కనిపించడం లేదన్నారు. 

ప్రజల సొమ్మును వేతనంగా తీసుకుంటున్న కేసీఆర్‌‌‌‌ ప్రజల్లోకి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్‌‌‌‌ యోగక్షేమాలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఆయనను గెలిపించిన ప్రజలపై ఉందని, అందుకే ఆయన ఆచూకీ కనిపెట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు అసంపూర్తిగా మిగిలాయని, వాటినిప్రశ్నించేందుకు కేసీఆర్‌‌‌‌ ప్రజల్లోకి రావాలన్నారు. పోలీసుల నుంచి సమాచారం రాకపోతే డైరెక్ట్‌‌‌‌గా కేసీఆర్‌‌‌‌ వ్యవసాయ క్షేత్రానికే వెళ్లి ఆయన యోగక్షేమాలు తెలుసుకుంటామన్నారు.