కరీంనగర్​లో త్వరలో 24/7 తాగునీరు

  • హౌసింగ్ బోర్డు కాలనీలో పైలట్ ప్రాజెక్టు అమలు
  • ఈ నెల 24న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి ప్రారంభించే చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌? 
  • తొలిదశలో 4,455 ఇళ్లకు నిరంతరం సాగునీరు

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ సిటీ ప్రజలు తమ ఇంట్లో ఎప్పుడు మున్సిపల్ నల్లా తిప్పినా నీళ్లు వచ్చే వెసులుబాటు త్వరలోనే అందుబాటులోకి రానుంది. 24/7 తాగునీటి సరఫరాకు సంబంధించిన పైలట్ ప్రాజెక్టును హౌసింగ్ బోర్డు కాలనీలో అమలుచేయబోతున్నారు. ఇందుకోసం ఇప్పటికే అవసరమైన పైప్ లైన్లు వేయడం, వాల్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు బిగించడం, రిపేర్లు చేయడం, నల్లాలకు మీటర్లు పెట్డడంలాంటి పనులు తుది దశకు చేరుకున్నాయి. 

సంక్రాంతి నాటికి ఈ పనులు పూర్తి చేసి ఈ నెల 24న కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పైలట్ ప్రాజెక్టు సక్సెస్ అయి.. సిటీ మొత్తానికి ఈ సౌకర్యం కల్పిస్తే 24/7 తాగునీరు సరఫరా చేసే మున్సిపల్ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దేశానికి ఆదర్శంగా నిలవనుంది. ప్రస్తుతం చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మనిమజ్రా ఏరియాలోని 1000 ఇళ్లకు, ఢిల్లీలోని రాజిందర్ నగర్ లోని 500 ఇళ్లకు మాత్రమే 24/7 నీటిని సరఫరా చేస్తున్నారు. కరీంనగర్ లో పైలట్ ప్రాజెక్టు 4,455 ఇళ్లతో ప్రారంభం కానుంది.  

 రూ.18 కోట్లతో పనులు.. 

కరీంనగర్ సిటీ పరిధిలో తాగునీటి సరఫరాకు 17 రిజర్వాయర్లు ఉండగా.. అందులో హౌసింగ్ బోర్డు కాలనీ రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాలకు తొలుత నిరంతరం నీటిని సరఫరా చేయాలని నిర్ణయించి రూ.18 కోట్లతో పనులు చేపట్టారు. ఇందులోభాగంగా 2.310 కిలోమీటర్ల హైడెన్సిటీ పాలిథిలిన్(హెడీపీఈ) పైప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ వేయడంతో పాటు, ఏడు బల్క్ ఫ్లో మోటర్లు, ఆరు చోట్ల 100 ఎంఎం డయా గేట్ వాల్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు బిగించారు.

 హౌసింగ్ బోర్డుకాలనీ రిజర్వాయర్ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీ, మారుతీనగర్, శాస్త్రీనగర్, గాయత్రినగర్, లక్ష్మీనగర్, హుస్సేనీ పుర ప్రాంతాల్లో పూర్తిగా, వరాహస్వామి ఆలయం, కాపువాడ, హుస్సేనీపుర, షాషాబ్ వీధిలోని కొన్ని ప్రాంతాల్లో కలిపి 4,455 నల్లాలకు మీటర్లు బిగిస్తున్నారు. 2,300 నల్లాలకు నిరంతరం నల్లా నీళ్లు వస్తున్నాయనే ఉద్దేశంతో వృథా చేయకుండా ఉండడం కోసమే మీటర్లను బిగిస్తున్నట్లు మున్సిపల్ ఆఫీసర్లు చెప్తున్నారు. 

దేశంలోనే తొలి మున్సిపల్ కార్పొరేషన్ రికార్డు

24/7 తాగునీటి సరఫరాకు సంబంధించి పైలెట్ ప్రాజెక్ట్ ను  హౌసింగ్ బోర్డు కాలనీలో ప్రారంభించబోతున్నాం. ఇప్పటికే రోజూ నీటి సరఫరా చేసే మున్సిపల్ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రాష్ట్రంలో ప్రత్యేక స్థానం ఉంది. అలాగే 4,455 ఇళ్లకు నిరంతరం నీరు సరఫరా చేసే కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గానూ రికార్డుల్లోకి ఎక్కనుంది.  ఈ స్కీమ్ ను కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించాలని భావిస్తున్నాం.  - కరీంనగర్, మేయర్ సునీల్ రావు