కోయంబత్తూరు నుంచి కమల్ హాసన్ పోటీ

కోయంబత్తూరు నుంచి కమల్ హాసన్ పోటీ

చెన్నై: తమిళనాడు ఎన్నికల బరిలోకి దిగుతున్నప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. సినీ రంగంలో దశాబ్దాలు గా అలరిస్తున్న కమల్ హాసన్ తమిళనాట ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టి మక్కల్ నీధి మైయమ్ (ఎంఎన్ఎం) పార్టీని స్థాపించారు. తోటి నటుడు శరత్ కుమార్ నేతృత్వంలోని ఏఎఎస్ఎంకే పార్టీతోపాటు  ఇందియ జయనాయగ కట్చితో పొత్తు పెట్టుకుని చెరో 40 స్థానాలు కేటాయించింది ఎంఎన్ఎం. కమల్ నేతృత్వంలోని పార్టీ 154 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దిగనుంది. కమల్ హాసన్ నేతృత్వంలోని కూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయనేనని శరత్ కుమార్ ఇదివరకే  ప్రకటించారు. చెన్నై నుంచి బరిలోకి దిగుతారన్న ప్రచారం నేపధ్యంలో ఇవాళ శుక్రవారం కమల్ హాసన్ కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించి ఊహాగానాలకు తెరదింపింది.