బ్యాంక్ మేనేజర్ ను చంపిన ఉగ్రవాది హతం

బ్యాంక్ మేనేజర్ ను చంపిన ఉగ్రవాది హతం

జమ్ముకశ్మీర్ ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్ లోని కంజియులర్ ప్రాంతంలో అర్ధరాత్రి ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతాబలగాల చేతిలో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న టైంలో.. మిలిటెంట్లు కాల్పులు జరిపినట్లు తెలిపారు కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్.

హతమైన ఉగ్రవాదులు లష్కరే తొయిబాకు చెందినవారిగా గుర్తించారు అధికారులు. టెర్రరిస్టుల్లో ఒకరిని షోపియాన్ కు చెందిన జాన్ మహ్మద్ లోన్ గా గుర్తించారు. ఈ నెల 2న కుల్గాం జిల్లాలో బ్యాంకు మేనేజర్ విజయ్ కుమార్ ను హతమార్చిన వ్యక్తిగా నిర్ధారించారు. మరో ఉగ్రవాదిని గుర్తించాల్సి ఉందన్నారు కశ్మీర్ ఐజీ. ఇంకా ఆపరేషన్ కొనసాగుతుందన్నారు.