సక్సెస్​: ఐఎస్ఏ అధ్యక్ష స్థానంలో భారత్

  • ఇటీవల ఇంటర్నేషనల్​ సోలార్ అలయెన్స్​

(ఐఎస్ఏ) ఏడో జనరల్​ అసెంబ్లీ ఢిల్లీలో సమావేశాలు జరిగాయి. ఇందులో ఐఎస్​ఏ ప్రెసిడెంట్​గా మళ్లీ భారత్​ ఎన్నికయింది. వైస్​ ప్రెసిడెంట్​ పదవికి ఫ్రాన్స్ ఎన్నికయింది. ఈ దేశాలు రెండేండ్లపాటు పదవిలో కొనసాగనున్నాయి. ఐఎస్ఏకి సంబంధించి స్టాండింగ్​ కమిటీకి చెందిన వైస్ ప్రెసిడెంట్​ స్థానాలును కూడా భర్తీ చేశారు. 

ఆఫ్రికా ప్రాంతం: వైస్​ ప్రెసిడెంట్లుగా ఘనా, సీషెల్స్​ ఎన్నిక కాగా, వాటికి సహకరించే వైస్​ చైర్​ దేశాలుగా దక్షిణ సూడాన్​, కామెరాన్​ ఎన్నికయ్యాయి. 

ఆసియా పిసిఫిక్​ ప్రాంతం: వైస్ ప్రెసిడెంట్లుగా ఆస్ట్రేలియా, శ్రీలంక, వైస్​ చైర్స్​గా యునైటెడ్​ అరబ్​ ఎమిరేట్స్​, పపువా న్యూగినియా ఎన్నికయ్యాయి.   

యూరప్​ ప్రాంతం: వైస్ ప్రెసిడెంట్లుగా  గ్రీస్​, నార్వే, వైస్​ చైర్స్​గా జర్మనీ, ఇటలీ దేశాలు ఎన్నికయ్యాయి. 
దక్షిణ అమెరికా, కరేబియన్​ ప్రాంతం: వైస్​ ప్రెసిడెంట్లుగా గ్రెనెడా, సురినామ్​, వైస్​ చైర్స్​గా జమైకా, హైతీలు ఎన్నికయ్యాయి.

ఐఎస్​ఏ డీజీ​గా ఆశీష్​ ఖన్నా ఎన్నికయ్యారు. ప్రస్తుత డైరెక్టర్​ జనరల్​ అజయ్​ మాథుర్​ వచ్చే ఫిబ్రవరిలో పదవీ విరమణ అనంతరం ఆశీష్​ ఖన్నా బాధ్యతలు చేపట్టనున్నారు. 

అంతర్జాతీయ సౌర కూటమి

 భూమధ్యరేఖకు ఇరువైపుల ఉన్న ఉష్ణమండల దేశాలన్నీ సంయుక్తంగా సౌరశక్తిని ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో 2015లో ఫ్రాన్స్​, భారత్​లు కలిసి కాప్​ 21 సదస్సులో ఈ కూటమిని ప్రారంభించాయి. 

  • ప్రధాన కార్యాలయం: హర్యానా (గురుగ్రామ్​)
  • సభ్యదేశాలు: 121 దేశాలు

ప్రధాన లక్ష్యాలు: 2030 నాటికి 1000 బిలియన్​ డాలర్ల పెట్టుబడులను సమకూర్చుకోవడం, 1000 గిగావాట్ల సౌరశక్తిని ఉత్పత్తి చేయడం, 1000 మిలియన్ల జనాభాకు సౌరశక్తిని, పర్యారవణ శక్తిని సరఫరా చేయడం ద్వారా ప్రతి ఏటా 1000 మిలియన్ల ఉద్గారాలను తగ్గించడం.