IND vs AUS 3rd Test: పొరపాటుగా ఆ పదం వాడాను.. బుమ్రాకు మహిళా కామెంటేటర్ క్షమాపణలు

బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా జరుగుతున్న టెస్టులో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా రాణించాడు. సహచరులు విఫలమవుతున్నా 6  వికెట్లు తీసి సత్తా చాటాడు. దీంతో బుమ్రాపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. కామెంటేటర్ గా వ్యవహరిస్తున్న ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ బుమ్రా బౌలింగ్ ను కొనియాడాడు. అయితే మహిళా అక్కడే ఉన్న కామెంటేటర్ ఇసా గుహ బుమ్రా పొగుడుతూ నోరు జారింది. ‘మోస్ట్ వాల్యుబుల్ ప్రిమేట్’ అనే పదం వాడింది.

ప్రిమేట్ అనే పదం ఆమె వాడడం సంచలనంగా మారింది. ఈ పదం చింపాజీ క్యారెక్టర్ తో ఆంగ్ల హాస్య చిత్రం. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్స్ గుహ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తన పొరపాటును తెలుసుకున్న ఆమె వెంటనే బుమ్రాకు క్షమాపణలు చెప్పింది. ‘‘మ్యాచ్ సమయంలో కామెంట్రీ చేస్తూ ఓ పదం వాడాను. బుమ్రా ఘనతలను ప్రశంసించే క్రమంలో పొరపాటు పదం వాడినట్లు అనుకుంటున్నా. అందుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నా.’’ అంటూ ఇషా గుహ  తెలిపింది. 

Also Read:-ఇంగ్లాండ్‌పై విలియంసన్ భారీ సెంచరీ..

ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 445 పరుగులకు ఆలౌట్ అయింది. 7 వికెట్ల నష్టానికి 405 పరుగులతో మూడో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా మరో 40 జోడించింది. క్యారీ 70 పరుగులు చేశాడు. అంతకముందు తొలి రోజు ఆస్ట్రేలియా బ్యాటర్లు ట్రావిస్ హెడ్ (152), స్టీవ్ స్మిత్ (101) సెంచరీలు చేసి ఆస్ట్రేలియా భారీ స్కోర్ అందించారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ప్రస్తుతం 4 వికెట్ల నష్టానికి 48 పరుగులు చేసింది. క్రీజ్ లో రాహుల్ (30), రోహిత్ శర్మ (0) ఉన్నారు. ప్రస్తుతం భారత్ 397 పరుగులు వెనకబడి ఉంది.