- నేడు ఆస్ట్రేలియా విమెన్స్‌తో ఇండియా మూడో వన్డే
- ఉ. 8.50 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో
పెర్త్: తొలి రెండు వన్డేల్లో భారీ ఓటమిని చవిచూసిన ఇండియా విమెన్స్ టీమ్ ఇప్పుడు పరువు కోసం పోరాడనుంది. బుధవారం ఆస్ట్రేలియాతో జరిగే ఆఖరిదైన మూడో వన్డేలో ఎలాగైనా గెలిచి వైట్‌వాష్ నుంచి తప్పించుకోవాలని భావిస్తోంది. వరల్డ్ కప్‌కు ముందు మరోసారి టీమ్‌ను పూర్తిస్థాయిలో చెక్ చేసుకోవాలని యోచిస్తోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్, వైస్ కెప్టెన్ స్మృతి మంధానావిఫలం కావడం జట్టును ఘోరంగా దెబ్బతీసింది.
మంధాన 8, 9 రన్స్‌కే పరిమితం కాగా, హర్మన్ 17, 38 రన్స్‌తో సరిపెట్టుకుంది. దీంతో కనీసం ఈ మ్యాచ్‌లోనైనా ఈ ఇద్దరు గాడిలో పడతారేమో చూడాలి. షెఫాలీ గైర్హాజరీతో కొత్త కాంబినేషన్‌ను ట్రై చేసే వెసులుబాటు టీమ్‌కు దొరికినా అవి పెద్దగా ఫలించడం లేదు.
భారీ ఆశలు పెట్టుకున్న రిచా ఘోష్ ఒకే ఒక్క హాఫ్ సెంచరీతో మెరిసింది. కాబట్టి ఈ మ్యాచ్‌లో బ్యాటర్లంతా సమష్టిగా రాణించాల్సిన అవసరం చాలా ఉంది. బౌలింగ్‌లోనూ ఇండియా అంచనాలను అందుకోలేకపోతోంది. మరోవైపు ఇప్పటికే సిరీస్ నెగ్గిన ఆసీస్ క్లీన్‌స్వీప్‌పై గురి పెట్టింది. కొత్త కెప్టెన్ తహ్లియా మెక్‌గ్రాత్ నేతృత్వంలోని టీమ్‌లో కొత్త జనరేషన్ ప్లేయర్లు అద్భుతంగా ఆడటం కంగారూలకు బాగా కలిసొస్తున్న అంశం.