89 ఏళ్ల ఏనుగు బిజులి ప్రసాద్ కన్నుమూత.. కన్నీళ్లు పెట్టిన జనం

89 ఏళ్ల ఏనుగు బిజులి ప్రసాద్ కన్నుమూత..  కన్నీళ్లు పెట్టిన జనం

ప్రపంచంలోనే అతి పురాతనమైన ఏనుగు బిజులి ప్రసాద్(89) మృతి చెందింది.  వృద్ధాప్య సమస్యల కారణంగా బిజులి ప్రసాద్   అసోంలోని సోనిత్ పూర్ జిల్లాలోని ది విలియమ్సన్ మాగోర్ గ్రూప్‌కు చెందిన బెహాలీ టీ ఎస్టేట్‌లో ఇవాళ(ఆగస్టు21)  తెల్లవారుజామున 3.30 గంటలకు  తుది శ్వాస విడిచింది.  తొమ్మిదేళ్ల క్రితం ప్రసాద్‌కు ఇంగ్లండ్‌కు చెందిన అతని మాస్టర్ ఆలివర్ సాహిబ్ పేరు పెట్టారు.

బిజులి మృతి పట్ల  జంతు ప్రేమికులు, తేయాకు తోటల కార్మికులు, స్థానికులు  సంతాపం తెలిపారు.  బిజులి ప్రసాద్‌తో  తమకు ఉన్న అనుబంధం గురించి తలసుకుని  కన్నీళ్లు పెట్టుకున్నారు.

 బిజులి ప్రసాద్ భారత దేశంలోనే అతి పురాతనమైన ఏనుగని  పద్మశ్రీ అవార్డు గ్రహీత , ఏనుగు శస్త్రవైద్యుడు డాక్టర్ కుశాల్ కొన్వర్ శర్మ తెలిపారు.  సాధారణంగా ఏనుగులు 62-65 సంవత్సరాలు జీవిస్తాయని.. అయితే సరైన సంరక్షణతో సుమారు 80 సంవత్సరాల వరకు జీవించే అవకాశం ఉందని చెప్పారు. దాదాపు 8-10 సంవత్సరాల నుంచి బిజులి ప్రసాద్ పళ్లన్నీ ఊడిపోయాయని.. దీంతో ఏమి తినలేక చనిపోవాలనుకున్నాడని తెలిపారు. అయితే బిజులికి చికిత్స చేసి బియ్యం, సోయాబిన్ వంటి ఉడికించిన ఫుడ్ ను ఎక్కువగా పెట్టామని చెప్పారు. ఏనుగుకు ప్రతిరోజూ దాదాపు 25 కిలోల ఆహారాన్ని అందించినట్లు చెప్పారు.  అధిక ప్రోటీన్ విలువతో అతని ఆయుష్సు పెంచిందని డాక్టర్ శర్మ  వెల్లడించారు.