ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్ ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాలు కశ్మీర్ జోన్ పోలీసులు. శ్రీనగర్ లోని నౌగావ్ ప్రాంతంలో పోలీసులు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు కశ్మీర్ జోన్ పోలీసులు. నిషేధిత లష్కరే తోషిబా, TRF ఔట్ ఫిట్ లో ఉన్న ఉగ్రవాదులను హతమార్చారు. ఖన్మోహ్ సర్పంచ్ సమీర్ హత్య కేసులో చనిపోయిన ఉగ్రవాదుల ప్రమేయం ఉన్నట్లు గుర్తించామన్నారు కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్.