మెదక్ జిల్లాలో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ల ఫీల్డ్ విజిట్

మెదక్, వెలుగు: ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు శిక్షణలో భాగంగా సోమవారం మెదక్ జిల్లాకు వచ్చారు. ఫీల్డ్ విజిట్ లో భాగంగా జిల్లాలో 8 రోజుల పర్యటనకు వచ్చిన 26 మంది ఐఏఎస్, ఐపీఎస్  అధికారుల బృందం ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ లో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తో సమావేశమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 21 నుంచి 28 వరకు మొదటి ఐదు రోజులు గ్రామస్థాయి పర్యటన, చివరి మూడు రోజులు అర్బన్ ఏరియాల్లో ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు పర్యటిస్తారన్నారు.

 మనోహరాబాద్ మండలంలోని కూచారం, తూప్రాన్ మండలంలోని మల్కాపూర్ , నర్సాపూర్ పరిధిలో అవంచ, రామాయంపేట మండలం  డి.ధర్మారం గ్రామాల్లో పర్యటించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల అమలు తీరును పరిశీలిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్​జిల్లాలో పాలన, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించారు.  వివిధ రాష్ట్రాల నుంచి మారుమూల జిల్లాకు పర్యటనకు విచ్చేసినందుకు ఆయన అధికారులను అభినందించారు. కార్యక్రమంలో రీజినల్ ట్రైనింగ్ సెంటర్ మేనేజర్ శంకర్, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఏవో గోవింద్, డీఎంహెచ్ వో శ్రీరామ్, డీడబ్ల్యూవో  హైమావతి, ట్రైనింగ్ కోసం వచ్చిన 26 మంది ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు పాల్గొన్నారు.