రాధాకిషన్‌‌‌‌‌‌‌‌ రావుకు మధ్యంతర బెయిల్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: ఫోన్‌‌‌‌‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌ కేసు నిందితుడు రాధాకిషన్‌‌‌‌‌‌‌‌ రావుకు హైకోర్టు మధ్యంతర బెయిల్‌‌‌‌‌‌‌‌ మంజూరు చేసింది. ఆయన మామ అంత్యక్రియల్లో పాల్గొనేందుకుగాను ఈ నెల 25న ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 28 సాయంత్రం 5 గంటల వరకు మధ్యంతర బెయిల్‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది.  రాధాకిషన్‌‌‌‌‌‌‌‌ రావును తిరిగి 28న జైలుకు తరలించేలా చర్యలు తీసుకోవాలని చంచల్‌‌‌‌‌‌‌‌గూడ జైలు సూపరింటిండెంట్ ను ఆదేశించింది. అతని కుటుంబ సభ్యులను, సమీప బంధువులను కలవడానికి రాధాకిషన్‌‌‌‌‌‌‌‌రావును అనుమతించాలి.

 అంత్యక్రియలు, ఇతర కార్యక్రమాలకు ఎస్కార్ట్‌‌‌‌‌‌‌‌ ఎలాంటి భంగం కలిగించకూడదు. ప్రయాణ ఖర్చులు, ఎస్కార్ట్‌‌‌‌‌‌‌‌ ఖర్చులు రాధాకిషన్‌‌‌‌‌‌‌‌రావు భరించాలి. జైలు నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి తిరిగి జైలుకు వెళ్లే వరకు టెలిఫోన్, మొబైల్‌‌‌‌‌‌‌‌ వినియోగించరాదని కోర్టు షరతులు విధించింది. ఎస్కార్ట్‌‌‌‌‌‌‌‌ బెయిల్‌‌‌‌‌‌‌‌ను రాధాకిషన్‌‌‌‌‌‌‌‌ దుర్వినియోగం చేయవద్దని చెప్పింది. ఫోన్‌‌‌‌‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌ కేసులో అరెస్టయిన రాధాకిషన్‌‌‌‌‌‌‌‌రావు చంచల్‌‌‌‌‌‌‌‌గూడ జైల్లో ఉన్నారు. ఆయన బెయిల్‌‌‌‌‌‌‌‌పిటిషన్‌‌‌‌‌‌‌‌పై హైకోర్టు తీర్పు వెలువరించాల్సి ఉంది. ఈ దశలో ఆయన మామ చనిపోవడంతో మంగళవారం న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌‌‌‌‌ కె.సుజన ఈ బెయిల్‌‌‌‌‌‌‌‌ ఆదేశాలను జారీ చేశారు.