మెదక్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్

గ్యాస్ సిలిండర్ పేలి గుడిసె దగ్ధం

  • కాలిపోయిన రూ.3.50 లక్షల నగదు, 5 తులాల బంగారం 

చిన్నశంకరంపేట, వెలుగు: చిన్నశంకరంపేట మండలం ప్యాట గడ్డ పంచాయతీ పరిధి తండాలో శుక్రవారం అర్ధరాత్రి గ్యాస్ సిలిండర్ పేలి గుడిసె కాలిపోయింది. గ్రామానికి చెందిన  రాములు నివాస గుడిసె లో సిలిండర్ పేలడంతో  శ్రీకాంత్ అనే వ్యక్తి గాయపడ్డాడు. ఇంటిలో ఉన్న మూడు లక్షల 50 వేల రూపాయల నగదు, ఐదు తులాల బంగారం, 20 తులాల వెండి, బీరువాలోనే పూర్తిగా దగ్ధమయ్యాయని బాధితుడు తెలిపాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

నేడు గవర్నర్ రాక 

మెదక్​ టౌన్, వెలుగు:  మెదక్​ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో తెలంగాణ గవర్నర్​ జిష్ణు దేవ్​ వర్మ ఆదివారం పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్​ రాహుల్​ రాజ్​ శనివారం ఏర్పాట్లను పరిశీలించారు. గవర్నర్​ ఆదివారం కొల్చారంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో విద్యార్థులతో మాట్లాడనున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. సందర్భంగా కలెక్టర్​ వెంట అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

స్తంభం ఎక్కి యువకుడి హల్ చల్  

సంగారెడ్డి టౌన్ ,వెలుగు: సంగారెడ్డిలోని విద్యుత్ ఎస్సీ కార్యాలయం సమీపంలోని 33/11 కెవి హై టెన్షన్ స్తంభాన్ని ఎక్కి యువకుడు హల్చల్ చేశాడు.  రాజంపేట కు చెందిన వెంకటేశ్ తన ఉద్యోగంతో పాటు కుటుంబ సమస్యలు పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వచ్చేంతవరకు తాను స్తంభం దిగేది లేదని భీష్మించుకూర్చున్నారు. కాంగ్రెస్ నాయకులు వచ్చి ప్రయత్నించినా ససేమిరా అనడంతో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేరుకొని యువకుడితో మాట్లాడి కిందకు దించారు.  అనంతరం వెంకట్‌‌‌‌‌‌‌‌ను పోలీసులు స్థానిక పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. 

పెండింగ్ కేసులు పరిష్కరించాలి

సిద్దిపేట రూరల్, వెలుగు: పెండింగ్ కేసులను త్వరగా డిస్పోజల్ చేయాలని, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ. డాక్టర్ బి. అనురాధ అన్నారు.  శనివారం సీపీ ఆఫీసులో పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల్లో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల వివరాలను ఏసీపీ, సీఐలను అడిగి తెలుసుకున్నారు. ఏసీపీలు మధు, పురుషోత్తం రెడ్డి, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.  

ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలి

సిద్దిపేట రూరల్, వెలుగు: ఇంటర్ పరీక్షల్లో  జిల్లా ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలని కాలేజీల ప్రిన్సిపల్స్, లెక్చరర్లకుడీఐఈఓ రవీందర్ రెడ్డి సూచించారు. శనివారం డీఐఈఓ ఆఫీసులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రభుత్వం నిర్దేశించిన 100 రోజుల ప్రణాళికలో భాగంగా తాను జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఇంటర్ కాలేజీలు అన్నింటిని సందర్శించానన్నారు. యాక్షన్ ప్లాన్ సక్రమంగా ఇంప్లిమెంట్ చేసేలా చూడాలని లెక్చరర్స్ ను కోరినట్లు తెలిపారు. పిల్లలు క్రమం తప్పకుండా కాలేజీకి వచ్చేలా చూడాలని కోరారు.