నల్గొండలో ముగిసిన గ్రూప్-2 పరీక్షలు

  • 50 శాతానికి మించి గైర్హాజర్​ 

యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ అర్బన్, వెలుగు : గ్రూప్​–2 ఎగ్జామ్స్​ ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎగ్జామ్స్​రాయడానికి అభ్యర్థులు పెద్దగా ఆసక్తి చూపలేదు. 50 శాతానికి మించి అభ్యర్థులు గైర్హాజర్​అయ్యారు. ఎగ్జామ్స్​ జరుగుతున్న పలు సెంటర్లను కలెక్టర్లు హనుమంతరావు, తేజస్​ నందలాల్​పవార్, ఇలా త్రిపాఠి సందర్శించి ఎగ్జామ్​జరుగుతున్న తీరును పరిశీలించారు. యాదాద్రి జిల్లాలో పేపర్​ 3 రాయడానికి 6,078 మంది అభ్యర్థులు కావాల్సి ఉండగా 2,909మంది హాజరయ్యారు. 3169 మంది గైర్హాజరు అయ్యారు. నాలుగో పేపర్​కు 2,907 హాజరు కాగా, 3,171 మంది గైర్హాజరయ్యారు. 

సూర్యాపేట జిల్లాలో.. 

సూర్యాపేట జిల్లాలో 16,857 మంది అభ్యర్థులు ఎగ్జామ్స్​ రాయాల్సిఉండగా, మూడో పేపర్​కు 8,479 మంది హాజరు కాగా, 8,378  మంది గైర్హాజరయ్యారు. నాలుగో పేపర్​కు 8,470 మందికి.. 8,387 మంది పరీక్షకు గైర్హాజరయ్యారు. 

నల్గొండ జిల్లాలో..

నల్గొండ, మిర్యాలగూడలో 89  కేంద్రాల్లో రెండో రోజు గ్రూప్-–2 పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. పట్టణంలోని నల్గొండ పబ్లిక్ స్కూల్ లో పరీక్షా కేంద్రాన్ని ఎస్పీ శరత్ చంద్ర పవార్ సందర్శించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 600 మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు.