- భారీ డిస్కౌంట్లతో జియోమార్ట్‌కు షిఫ్ట్ అవుతున్న కిరాణ షాపులు
- తమ జాబ్స్ పోతాయని భయపడుతున్న 4.5 లక్షల మంది సేల్స్‌మెన్
- యూనిలీవర్, కోల్గేట్, మరో 20 కంపెనీలకు సేల్స్‌మెన్ ఫెడరేషన్ వార్నింగ్
బిజినెస్ డెస్క్, వెలుగు: కిరాణ షాపులకు ప్రొడక్ట్‌లను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సేల్స్‌మెన్ ముకేశ్ అంబానీకి చెందిన జియోమార్ట్‌పై గుర్రుగా ఉన్నారు. భారీగా డిస్కౌంట్లు ఇస్తుండడంతో కిరాణా షాపులు డైరెక్ట్‌గా జియో మార్ట్ పార్టనర్స్ ప్లాట్‌ఫామ్ నుంచే ఆర్డర్స్ పెట్టుకుంటున్నాయి. దీంతో తమ జాబ్స్ పోతాయని ఈ సేల్స్‌మెన్ భయపడుతున్నారు. రెకిట్ బెంకిసెర్, హిందుస్తాన్ యూనిలీవర్, కోల్గేట్ పాల్‌మోలివ్ వంటి కన్జూమర్ కంపెనీలకు వార్నింగ్ ఇస్తున్నారు. ఈ కంపెనీలు తమకు కూడా రిలయన్స్‌కు ఇచ్చే రేటుకే ప్రొడక్ట్‌లను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే ప్రొడక్ట్‌ల డిస్ట్రిబ్యూషన్‌లో జియోమార్ట్‌తో పోటీ పడగలుగుతామని అన్నారు. రిలయన్స్ జియో మార్ట్ భారీగా డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. దీంతో కిరాణ షాపులు ఈ యాప్ నుంచి ఆర్డర్లు పెట్టుకోవడం బాగా పెరిగింది. గత ఏడాది కాలంలో డైరెక్ట్‌గా కిరాణ షాపులకు అమ్మే ప్రొడక్ట్స్ 20–25 శాతం మేర తగ్గాయని రెకిట్ బెంకిసెర్, యూనిలీవర్, కోల్గేట్ వంటి పెద్ద కంపెనీలు ప్రకటించడం గమనించాలి.
జాబ్స్ పోతాయ్..
జియోమార్ట్ పార్టనర్ యాప్ బాగా విస్తరిస్తుండడంతో వివిధ కంపెనీలకు చెందిన 4.5 లక్షల మంది సేల్స్‌మెన్ తమ జాబ్స్ పోతాయని భయపడుతున్నారు. కొన్ని దశాబ్దాల నుంచి ప్రతీ స్టోర్‌కి వెళ్లి ప్రొడక్ట్‌లను అమ్ముతున్నామని అన్నారు. రాయిటర్స్‌లో వచ్చిన స్టోరీ ప్రకారం, ఆల్ ఇండియా కన్జూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ కన్జూమర్ కంపెనీలకు లెటర్ రాసింది. రిలయన్స్ వంటి పెద్ద డిస్ట్రిబ్యూటర్లకు అమ్మే రేటుకే తమకు కూడా ప్రొడక్ట్‌లను సేల్ చేయాలని ఈ లెటర్ ద్వారా డిమాండ్ చేసింది. ఒకవేళ అలా చేయకపోతే కిరాణాలకు డిస్ట్రిబ్యూట్ చేసే ప్రొడక్ట్‌లను ఆపేస్తామని ప్రకటించింది. కన్జూమర్ కంపెనీలు రిలయన్స్ వంటి పెద్ద కంపెనీలతో జనవరి 1 తర్వాత కూడా పార్టనర్‌షిప్‌ను కొనసాగిస్తే, కొత్తగా లాంచ్ చేసే ప్రొడక్ట్‌లను కిరాణాలకు డిస్ట్రిబ్యూట్ చేయమని వార్నింగ్ ఇచ్చింది.
కోటి కిరాణాలతో పార్టనర్‌షిప్పే జియోమార్ట్ టార్గెట్
‘చాలా ఏళ్ల నుంచి సర్వీస్‌లను అందిస్తూ రిటైలర్ల దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాం..మేము ‘సహాయ నిరాకరణ’ ఉద్యమాన్ని చేపట్టాలని నిర్ణయించుకున్నాం’ అని ఆల్ ఇండియా కన్జూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ లెటర్‌లో పేర్కొంది. ఈ లెటర్‌ను రెకిట్, హిందుస్తాన్ యూనిలీవర్, కోల్గేట్, మరో 20 కన్జూమర్ కంపెనీలకు పంపామని ఈ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ధైర్యశాలి పాటిల్ పేర్కొన్నారు. దేశ రిటైల్ మార్కెట్‌లో కిరాణ షాపుల వాటా 80 శాతంగా ఉంది. ప్రస్తుతం 150 సిటీలకు చెందిన 3 లక్షల కిరాణాలు రిలయన్స్‌కు ఆర్డర్లు పెట్టుకుంటున్నాయి. జియోమార్ట్ కూడా 2024 నాటికి కోటి కిరాణాలతో పార్టనర్‌షిప్ కుదుర్చుకోవాలని టార్గెట్‌గా పెట్టుకుంది. రిలయన్స్ తక్కువ రేట్లకు ప్రొడక్ట్‌లను సప్లయ్ చేస్తోందని, ఈ కంపెనీతో పోటీ పడలేక డెలివరీ వెహికల్స్‌ను, స్టాఫ్‌ను తగ్గించుకుంటున్నామని, తమ బిజినెస్ దెబ్బతింటోందని ధైర్యశాలి అన్నారు. కాగా, కిరాణాలు ట్రెడిషనల్ డిస్ట్రిబ్యూటర్ల నుంచి కాకుండా రిలయన్స్ నుంచి ప్రొడక్ట్‌లను సేకరించడం నిలకడగా పెరుగుతోందని ఈ ఏడాది మార్చిలో జెఫరీస్ పేర్కొంది. 2025 నాటికి కంపెనీ అందిస్తున్న ఇటువంటి సేల్స్ 10.4 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జియోమార్ట్ ద్వారా కిరాణాలకు 200 మిలియన్ డాలర్ల విలువైన సేల్స్
జరుగుతాయని జెఫరీస్ అంచనా వేసింది.
