ఫలహారం బండి ప్రారంభించిన ఎమ్మెల్యే

శివ్వంపేట, వెలుగు: అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే సునీతా రెడ్డి అన్నారు. ఆషాఢం సందర్భంగా సోమవారం ఆమె స్వగ్రామమైన శివ్వంపేట మండలంలోని గోమారంలో ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే ఇంటి వద్ద నుంచి పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల సిగాలు, యువకుల నృత్యాలతో ఉత్సాహంగా ఊరేగింపు సాగింది.

 ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఫారెస్ట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ప్రతాపరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్ర గౌడ్, మాజీ ఎంపీపీ హరికృష్ణ, జడ్పీ మాజీ కోఆప్షన్ మెంబర్​మన్సూర్,  మండల పార్టీ అధ్యక్షుడు రమణ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ రమాకాంత్ రెడ్డి, నాయకులు యాదవ్ గౌడ్, మహేందర్ రెడ్డి, హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు.