Life Style News: ఫ్యామిలీ డాక్టర్​ ఇంపార్టెన్స్​ మీకు తెలుసా..

పూర్వ కాలంలో సైకిల్​ ముందు ఒక బ్యాగ్​... వెనుక ఒక మందుల పెట్టె కట్టుకొని డాక్టర్లు పల్లెల్లో తిరిగేవారు. ఇక వారికి ఆయా గ్రామాల ప్రజల ఆరోగ్య విషయాలు పూర్తిగా తెలుస్తాయి. వారికి ఎప్పుడు ఏదైనా డిసీజ్​ వస్తే ... వారి ఆరోగ్య పరిస్థితి ఆ ఫ్యామిలీ డాక్టర్​ కు అంతా తెలుసు కాబట్టి.. ట్రీట్​ మెంట్​ తక్కువ ఖర్చులోఅయ్యేది. అయితే రాను రాను కార్పొరేట్​ ఆస్పత్రులు రావడంతో ఫ్యామిలీ డాక్టర్ అనే మాటే లేకుండా పోయింది. 

పాత సినిమాల్లో ఒక సీన్ ఉంటుంది. ఇంట్లో ఎవరికి ఏం అయినా డాక్టర్ తన మందుల పెట్టెతో ఇంటికి వస్తాడు, ఇంట్లో అన్ని విషయాలూ మాట్లాడతాడు. చెకప్ అయిపోగానే మిగతావాళ్లకి కూడా ఓ రెండు డైలాగులు చెప్పి వెళ్ళిపోతాడు. ఇప్పటి జనరేషన్ కి తెలియదు గానీ, ఒకప్పుడు నిజంగా ఇలాంటి ఫ్యామిలీ డాక్టర్స్ ఉండేవాళ్లు. మరీ అన్నిసార్లు ఇంటికి రాకపోయినా ఒక కుటుంబంలోని అన్ని రకాల సమస్యలూ తెలిసేవి.

మెల్లగా కాలం మారింది. మన బాడీలో ఉండే ఒక్కోపార్ట్ కి ఒక్కో డాక్టర్ వచ్చాక, హాస్పిటల్స్ లోకి కార్పొరేట్లు వచ్చాక, ఫ్యామిలీ డాక్టర్స్ తగ్గిపోయారు. ప్రస్తుతం ఏ చిన్న సమస్య వచ్చినా అన్ని రకాల టెస్టులూ రాస్తున్నారు.  కోవిడ్ ఎటాక్ కి ముందు వరకూ ఫ్యామిలీ డాక్టర్ అనే కాన్సెప్ట్ ని అంతగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఒక పర్సనల్ డాక్టర్ అంటూ ఉండటం ఎంత అవసరమో తెలుస్తోంది.

ఫ్యామిలీ డాక్టర్ ఎందుకు అవసరం?

ఒక డాక్టర్ దగ్గరికే రెగ్యులర్ గావెళ్లటం వల్ల మన లైఫ్ స్టయిల్, మన ఫుడ్ హ్యాబిట్స్, మనకి ఉన్న పాస్ట్ హెల్త్ కాంప్లికేషన్స్ అన్నీ తెలుస్తాయి. నిజానికి మనకి ఒక హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిందీ అంటే. కచ్చితంగా మన హెల్త్ కి సంబందించిన  రిపోర్టులన్నీ... అంటే గతంలోవి కూడా ఉండాలి. ఒకే డాక్టర్ ఉండటం వల్ల మనకి ఉండే అలర్జీల దగ్గరనుంచీ పూర్తి అవేర్నెస్ ఆ డాక్టర్ కి ఉంటుంది. ఏవైనా వ్యాధులు రాబోయే అవకాశం ఉన్నా ముందస్తుగానే హెచ్చరిస్తారు

 గతంలో మనకు పూర్తిగా హెల్త్​ గైడెన్స్​ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఏ సమస్య వచ్చినా అన్ని రకాల టెస్టులూ చేయించాల్సిందే. కార్పొరేట్ హాస్పిటల్స్ లో మనం విజిట్ చేసిన ప్రతీసారీ ఒకే డాక్టర్ అందుబాటులో ఉండరు. అంతేకాదు అక్కడ ఉండే రష్ ని బట్టి మనల్ని, ముందున్న సమస్యలనీ ఆ డాక్టర్ మనకి ఇంతకు పర్టిక్యులర్ గా గుర్తు పెట్టుకోవటమూ కుదరదు. కాబట్టి. మనం కొత్త సమస్యతో హాస్పిటల్ కి వెళ్ళిన ప్రతీసారీ అన్ని రకాల టెస్టులూ చేయించుకోవాల్సిందే. ప్రీవియస్ హెల్త్ హిస్టరీ మనం చెప్తే తప్ప డాక్టరికి తెలిసే అవకాశం చాలా  తక్కువ. దీనివల్ల ప్రతీసారీ డబ్బు, టైమూ రెండూ వేస్ట్ అవుతున్నాయి.

 ఒక సమస్యని డయాగ్నయిజ్ చేయటానికి ఎక్కువ టైం పడుతోంది . అదే  కోవిడ్ టైంలో పెద్ద సమస్య అయ్యింది. హెల్త్ మీద భరోసా పెరిగింది కానీ పూర్తి స్థాయి వైద్యం మాత్రం ఇప్పుడు మామూలు జనానికి భారం అవుతోంది. ఒక డిసీజ్ ని డయాగ్నయిజ్ చేయటానికి చేసే టెస్టుల్లో చాలా వరకు ప్రతిసారీ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ మన పూర్తి బాడీ హెల్త్ కండిషన్ ఎలా ఉందో తెలుసుకోవటానికి ఇది తప్పనిసరి.

ఒకప్పటికంటే ఇప్పుడు డాక్టర్స్ సంఖ్య పెరిగింది. జనరల్ ఫిజీషియన్స్ ఇప్పుడు చాలా అవసరం. కార్పొరేట్ హాస్పిటల్స్​ లో  అయినా రెగ్యులర్​ గా  ఒకే డాక్టర్ని కలిసే అవకాశం ఉంటే ఈ సమస్యని ఈజీగా దాటవచ్చు. అంటే కొన్ని ఫ్యామిలీస్ కి రెగ్యులర్​ గా  ఒకే డాక్టర్ దగ్గరకు  అటెండ్ అయితే  ఆ పర్టిక్యులర్ ఫ్యామిలీ హెల్త్ హిస్టరీ మొత్తం ఆ డాక్టర్ కి తెలిసి ఉంటుంది. కాబట్టి ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు కచ్చితమైన వివరాలు స్పెషలిస్ట్ డాక్టర్స్ కి ఈ ఫ్యామిలీ డాక్టర్ ఇవ్వగలడు. ఇప్పటికే ఈ పద్దతిని ఒకటి రెండు హాస్పిటల్స్ ఫాలో అవుతున్నా ఆ ఫీజులు భరించటం మామూలు జనం వల్ల మాత్రం కాదు. అందుకే ఇప్పుడు మళ్లీ ఫ్యామిలీ డాక్టర్స్ అవసరం కనిపిస్తోంది. 

కోవిడ్ అటాక్ మొదలైనప్పటినుంచీ ఏ లక్షణాలు ఉంటే అది కరోనా అనే విషయంలో చాలా మంది కన్​ఫ్యూజ్​  అయ్యారు. తర్వాత అసలు కరోనా లక్షణాలు కూడా కనిపించకుండానే చాలామందికి పాజిటివ్ వచ్చింది. నిజానికి ఫ్యామిలీ డాక్టర్ ఉండి రెగ్యులర్ చెకప్ లు జరుగుతూ ఉంటే ఇలా ఇంత కన్ఫ్యూజన్ కానీ.. లక్షణాలు కనిపించక ఎక్కువ ఆలస్యం చేసి ప్రాణాలమీదకి తెచ్చుకోవటం కానీ... జరిగేది కాదు.  ఇప్పుడు ఆస్ప్రతులకు వెళుతున్నా... ఒకే ఆస్పత్రికి..ఒకే డాక్టర్​ దగ్గరకు వెళ్లేలా ప్లాన్​ చేసుకోండి. ఇప్పటివరకు ఉన్నహెల్త్​ రిపోర్టుల ఫైల్​ మెయింటైన్​ చేయండి. ఎప్పుడు ఆస్పత్రికి వెళ్లినా...ఆఫైల్​ ను డాక్టర్​ కు చూపించండి. ఇలా చేయడం వలన మీ హెల్త్​ కండీషన్​ డాక్టర్​ కు త్వరగా అర్దమయి.. ప్రతిసారి అన్ని టెస్టులకు రిఫర్​ చేయకుండా ఉంటారు. మరి ఇప్పటికైనా..ఫ్యామిలీ డాక్టర్​ ఫ్యామిలీ ఆస్పత్రిని మెయింటైన్​ చేయండి.