నవంబర్ 2న విచారణకు రావాల్సిందే

నవంబర్ 2న విచారణకు రావాల్సిందే

న్యూఢిల్లీ: టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా వచ్చే నెల 2న విచారణకు హాజరుకావాలని పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ తేల్చి చెప్పింది. మహువా డబ్బులు తీసుకుని పార్లమెంట్‌‌లో ప్రశ్నలు అడుగుతున్నారని ఇటీవల బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే స్పీకర్ కు లేఖ రాశారు. స్పీకర్ దీనిని ఎథిక్స్ కమిటీ విచారణకు అప్పగించారు. విచారణ కోసం ఈ నెల 31న వ్యక్తిగతంగా హాజరు కావాలని మొయిత్రాకు కమిటీ ప్యానల్‌‌ చైర్మన్‌‌ సమన్లు జారీ చేశారు. దీనిపై ఆమె స్పందిస్తూ .. ముందుగా షెడ్యూల్ చేసిన కార్యక్రమాలకు హాజరుకావాల్సి ఉందని, తనకు కాస్త గడువు ఇవ్వాలని కోరారు. ఆమె రిక్వెస్టును పరిశీలించిన ఎథిక్స్ కమిటీ.. విచారణ తేదీని మార్చి నవంబర్ 2న వ్యక్తిగతంగా కమిటీ ముందు హాజరు కావాలని.. ఇంతకు మించి పొడిగింపు ఉండదని స్పష్టం చేసింది.

లాగిన్ ఐడీని నేనే ఇచ్చా: మొయిత్రా

హిరానందానీ గ్రూప్ సీఈవో దర్శన్ హీరానందాకు పార్లమెంట్ లాగిన్ ఐడీ తానే ఇచ్చినట్లు ఎంపీ మహువా మొయిత్రా అంగీకరించారు. తాను లోక్ సభలో  అడిగే ప్రశ్నలను టైప్ చేయడానికి ఇచ్చినట్లు తెలిపారు. పార్లమెంట్​లో ప్రశ్నలు అడగడాని కి హిరానందాని నుంచి డబ్బులు తీసుకున్న ట్లు వస్తున్న ఆరోపణలో నిజం లేదన్నారు. అతనిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి తనకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.