ముల్తాన్ వేదికగా తొలి టెస్ట్.. తొలి ఇన్నింగ్స్ లో పాక్ 556 పరుగులు.. జట్టులో స్టార్ బౌలర్లు.. ఆడుతుంది సొంతగడ్డపై.. ఇంకేముంది ఈ మ్యాచ్ లో పాక్ విజయం సాధిస్తుంది. లేకపోతే మ్యాచ్ డ్రా అవ్వడం ఖాయం అనుకున్నారు. అయితే ఫలితం మాత్రం భిన్నంగా వచ్చింది. తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ చేసినా పాకిస్థాన్ కు పరాభవం తప్పలేదు. చివరి రోజు రెండో ఇన్నింగ్స్ లో 220 పరుగులకు ఆలౌట్ అయ్యి ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో ఘోరంగా ఓడింది.
ఓవర్ నైట్ స్కోర్ 152/6 తో ఐదో రోజు ఆట ప్రారంభించిన పాకిస్థాన్ మరో 68 పరుగులు జోడించి మిగిలిన నాలుగు వికెట్లను కోల్పోయింది. సల్మాన్ ఆగా (63), అమేర్ జమాల్ (55) హాఫ్ సెంచరీలతో పోరాడినా పాక్ పరాజయాన్ని ఆపలేకపోయారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జాక్ లీచ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. కార్స్, అట్కిన్సన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. వోక్స్ కు ఒక వికెట్ దక్కింది. ఈ విజయంతో ఇంగ్లాండ్ మూడు టెస్టుల సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. అక్టోబర్ 15న రెండో ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ జరుగుతుంది.
నాలుగో రోజు హ్యారీ బ్రూక్ (322 బాల్స్‌లో 29 ఫోర్లు, 3 సిక్స్‌లతో 317), జో రూట్ (375 బాల్స్‌లో 17 ఫోర్లతో 262) రికార్డులు బద్దలు కొట్టడంతో.. 492/3 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు గురువారం ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌ను 150 ఓవర్లలో 823/7 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. దీంతో ఇంగ్లిష్ టీమ్‌కు 267 రన్స్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్ లో 556 పరుగులకు ఆలౌట్ అయింది.
This is the first time a team has lost by an innings after a 500+ first-innings total ?https://t.co/jamBKcZih8 | #PAKvENG pic.twitter.com/B7m8Vwg2r1
— ESPNcricinfo (@ESPNcricinfo) October 11, 2024