మహిళా సంఘాలకు ప్రభుత్వ సహకారం : కలెక్టర్ ఇలా త్రిపాఠి

మహిళా సంఘాలకు ప్రభుత్వ సహకారం : కలెక్టర్ ఇలా త్రిపాఠి
  • కలెక్టర్ ఇలా త్రిపాఠి 

నల్గొండ అర్బన్, వెలుగు : స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. శుక్రవారం నల్గొండలోని టీటీడీసీలో పరిశ్రమల శాఖ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సంయుక్త సహకారంతో అలీప్ సంస్థ ఆధ్వర్యంలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్​ముఖ్య​అతిథిగా హాజరై మాట్లాడుతూ స్వయం సహాయక మహిళా సంఘాల సంక్షేమం, అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. మహిళా సంఘాల సభ్యులు ఇందిరా మహిళా శక్తి సంఘాలుగా ఏర్పడి వివిధ రకాల యూనిట్లతో పరిశ్రమలను ఏర్పాటుకు ముందుకు రావాలని సూచించారు.

 వారికి రుణాలతోపాటు వ్యాపార నిర్వహణకు అవసరమైన మెళకువలు, పరిజ్ఞానాన్ని ఆయా సంస్థల ద్వారా అందిస్తామన్నారు. అనంతరం నల్గొండలోని బాలికల జూనియర్ కళాశాలను ఆమె సందర్శించారు. ఇంటర్​ విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. విద్యార్థులకు డిక్షనరీలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఆర్డీవో శేఖర్ రెడ్డి , ఏపీ శ్రావణ్ కుమార్, అలీప్ సంస్థ సెక్రటరీ పద్మజ, కమిటీ సభ్యురాలు పద్మావతి, సీనియర్ ప్రోగ్రామ్ అధికారి లక్ష్మీప్రియ, ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్యాంసుందర్ పాల్గొన్నారు.