న్యూఢిల్లీ: ఉపాధి హామీ పథకంలో లబద్ధిదాదారులకు కూలీ రేట్లను కేంద్రం సవరించింది. ఆయా రాష్ట్రాల్లో రోజువారీ కూలీని 4 నుంచి 10% వరకు పెంచింది. ఎన్నికల కోడ్ ఉన్నందున కూలీ రేట్ల సవరణకు ఈసీ నుంచి కేంద్రం ముందస్తు అనుమతి తీసుకుంది. సవరణ తర్వాత.. హర్యానాలో రూ.374కు కూలీ పెరిగింది. ఏపీ, తెలంగాణలో రూ.28 పెంచడంతో కూలీ రేటు రూ.300కు చేరింది. గోవాలో అత్యధికంగా రూ.34 పెంచగా.. కూలీ రూ.356కు పెరిగింది. యూపీలో అత్యల్పంగా రూ.7 పెంచడంతో కూలీ రూ.237కు చేరింది.
