30న నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక

30న నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక

దేశంలోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప-ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది సీఈసీ.పశ్చిమ బెంగాల్‌లో 3, ఒడిశాలో ఒక అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు నిర్వహించనుంది. పశ్చిమ బెంగాల్‌లో భవానీపూర్, శంషేర్‌గంజ్, జంగీపూర్ నియోజకవర్గాలు, ఒడిశాలోని పిప్లి అసెంబ్లీ నియోజకవర్గానికి సెప్టెంబర్ 30న పోలింగ్, అక్టోబర్ 3న కౌంటింగ్ జరగనుంది. సెప్టెంబర్ 6 న  ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారు. నామినేషన్ల దాఖలుకు  సెప్టెంబర్ 13 చివరి తేది.