పాల‌పిట్ట పార్కులోని ఎస్టీపీ పనుల పరిశీలన

హైదరాబాద్​సిటీ, వెలుగు: కొత్తగూడ‌లోని పాల‌పిట్ట సైక్లింగ్ పార్కులో వాటర్​బోర్డు నిర్మిస్తున్న సీవేజ్​ట్రీట్​మెంట్ ప్లాంట్ పనులను ఈడీ మయాంక్ మిట్టల్ శుక్రవారం పరిశీలించారు. ప్రాజెక్టర్​డైరెక్టర్ ఆయ‌న‌కు పనుల పురోగతిని వివ‌రించారు. వారంలోపు ప‌నుల‌ను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాల‌ని మయాంక్​మిట్టల్​సూచించారు. గార్డెనింగ్, ల్యాండ్ స్కేప్ పనులు చేపట్టాలన్నారు. ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్, ఎస్టీపీ సీజీఎం పద్మజ‌, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.