కోడిపందాల స్థావరాలపై పోలీసుల దాడులు

  • 10 మంది అరెస్ట్ 

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : బిజినపల్లి మండలం మంగనూరు శివారులోని చింతల బండ అటవీ ప్రాంతంలో కోడి పందాల స్థావరాలపై దాడులు నిర్వహించి పది మందిని అరెస్టు చేసినట్లు ఆదివారం నాగర్ కర్నూల్ డీఎస్పీ  బుర్రి శ్రీనివాస్ తెలిపారు. బిజినపల్లి లో ఆయన మీడియాతో మాట్లాడారు.

 మంగనూరు  శివారులో    దాదాపు 30 మంది  కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది.  దీంతో దాడులు చేసి   10 మందిని  అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.  ప్రధాన నిర్వాహకుడు చేగుంటకు చెందిన గంటల నరేశ్​ తప్పించుకున్నాడు.  ఈ దాడుల్లో 17 బైకులు, 8 మొబైల్ ఫోన్లు, నాలుగు పందెం కోళ్ళు ,13 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు.  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు డీఎస్పీ  వెల్లడించారు.