హైదరాబాద్ లో 2 కోట్ల విలువైన డ్రగ్స్ దగ్ధం

హైదరాబాద్​సిటీ, వెలుగు: హైదరాబాద్ ఎక్సైజ్ డివిజన్ పరిధిలో 59 కేసుల్లో పట్టుకున్న వివిధ రకాల డ్రగ్స్, గంజాయిని అధికారులు దగ్ధం చేశారు. హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ కేఏబీ శాస్ర్తి ఆదేశాల మేరకు జీజే మల్టీ క్లౌడ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఈ డ్రగ్స్ ను దహనం చేశారు. 

ఇందులో 240 కేజీల గంజాయి, 496కేజీల ఎండీఎంఏ, హాష్ ఆయిల్, పాపిస్ట వంటి పలు రకాల డ్రగ్స్ ఉన్నాయి. కాల్చి వేసిన డ్రగ్స్ విలువ రూ.రెండు కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. నారాయణ గూడ, సికింద్రాబాద్, అమీర్ పేట్, చార్మినార్ స్టేషన్లలో ఈ డ్రగ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.