డ్రైనేజీ లైన్​కు రిపేర్లు చేస్తుండగా పగిలిన వాటర్ పైప్​లైన్

  • ఇయ్యాల పలు ప్రాంతాలకు వాటర్​ సప్లయ్​ బంద్​

మెహిదీపట్నం, వెలుగు: రెడ్​హిల్స్ ఎంఎన్​జే హాస్పిటల్ కు సమీపంలోని డ్రైనేజీ పైప్​లైన్​కు శనివారం రిపేర్లు చేస్తుండగా డ్రింకింగ్​వాటర్​మెయిన్ పైప్​లైన్ పగిలిపోయింది. దీంతో భారీ మొత్తంలో తాగునీరు వృథాగా పోయింది. వెంటనే ఆసిఫ్ నగర్ ఫిల్టర్ బెడ్​పైప్ లైన్ వాల్ బంద్​చేశారు. 

దీంతో రెడ్ హిల్స్, బజార్ ఘాట్, మల్లేపల్లి, సీతారాంబాగ్, నాంపల్లి రైల్వేస్టేషన్, నీలోఫర్ హాస్పిటల్, ఎంఎన్ జే క్యాన్సర్ హాస్పిటల్, యూసుఫ్ ఖాన్ దర్గా ఏరియా, ఏక్ మినార్, గోడే కబర్, గన్ ఫౌండ్రి, ఆదర్శనగర్, బీజీఆర్ నగర్, 2 బీహెచ్ కే, ఖైరతాబాద్, మింట్ కాంపౌండ్, ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్, ఏసీ గాడ్స్, ఇన్​కం ట్యాక్స్ క్వార్టర్స్, విజయనగర్ కాలనీ, గోకుల్ నగర్, మంగర్ బస్తీ ప్రాంతాలకు తాగునీటి సరఫరా బంద్​అయింది. రిపేర్లు కారణంగా ఆదివారం కూడా సరఫర ఉండదని వాటర్​బోర్డు డీజీఎం షరీఫ్ తెలిపారు..