నేడు సీపీఎం బహిరంగ సభ : ఎండీ జబ్బార్

  • జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్ 

వీపనగండ్ల. వెలుగు:  వీపనగండ్ల మండలకేంద్రంలో ఆదివారం  జరుగనున్న సీపీఎం మహాసభల  బహిరంగ సభను సక్సెస్​ చేయాలని  జిల్లా కార్యదర్శి ఎండీ జబ్జార్​ పిలుపునిచ్చారు. శనివారం ఆయన  పార్టీ కార్యకర్తలతో కలిసి బహిరంగ సభ ప్రాంగణంలో పార్టీ ఫొటో ఎగ్జిబిషన్​ను ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.  బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం,   పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు బి వెంకట్,   రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్ వెస్లీ, సాగర్ పాల్గొంటారని తెలిపారు. 

మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు , కార్మికులు,  రైతులు,  కూలీలు  పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ మహాసభలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల రోజుల్లో పోరాటాలు చేయాలని, వీర తెలంగాణ సాయుధ రైతంగ పోరాటంలో భూమికోసం, నియంతృత్వానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఎంతోమంది అమరులయ్యారని గుర్తు చేశారు.  కార్యక్రమంలో సీపీఎం సీనియర్​ నాయకులు భా స్కర్ రెడ్డి,  మండల కార్యదర్శి రెడ్డి బాల్ రెడ్డి,   మాజీ సర్పంచ్ మౌలాలి. మహబూబ్ బాషా,మురళీ, సీహెచ్ వెంకటయ్య, ఆశన్న, ఈశ్వర్, లక్ష్మణ్, ఆది, మహేశ్​, నరసింహ, వెంకన్న, రామకృష్ణ, నవీన్, మల్లేశ్​ తదితరులు పాల్గొన్నారు.