మెదక్​ చర్చిలో భక్తుల సందడి

మెదక్​టౌన్, వెలుగు: మెదక్​ చర్చికి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం శిలువ ఊరేగింపు నిర్వహించగా మధ్యాహ్నం చర్చి ప్రెసిబిటరీ ఇన్​చార్జి  శాంతయ్య​ దైవసందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా చర్చి కమిటీ సభ్యులు పాడిన భక్తి పాటలు అందరినీ అలరించాయి. అనంతరం చర్చి ఫాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా పలువురు చర్చి కమిటీ సభ్యులు సువార్త ప్రకటన వినిపించారు. 

రెండో శనివారం, ఆదివారం, సోమవారం మూడు రోజులు పాటు వరుస సెలవులు రావడంతో చర్చికి మెదక్​ జిల్లాతో పాటు హైదరాబాద్​, రంగారెడ్డి, నిజామాబాద్​, కామారెడ్డి జిల్లాలే కాకుండా కర్నాటక, మహారాష్ట్ర వంటి దూర ప్రాంతాల నుంచి సైతం భక్తులు తరలివచ్చి ప్రార్థనల్లో పాల్గొన్నారు. 15mdk50 - ప్రార్థనలు చేస్తున్న భక్తులు