వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్‌కు ఇవాళ(శుక్రవారం) పెరేల్ మంజూరైంది. అస్వస్థతతో ఉన్న తన తల్లిని చూసేందుకు 21 రోజుల పెరోల్ కోరుతూ ఈనెల 17న ఆయన దరఖాస్తు చేసుకోగా.. రాష్ట్ర పోలీసులు ఇందుకు అనుమతించారు. దీంతో రోహ్‌తక్‌లోని సునరియా జైలు నుంచి శుక్రవారం ఉదయం ఆయన పెరోల్‌పై విడుదలయ్యారు. తన తల్లిని కలుసుకునేందుకు వీలుగా భారీ భద్రత మధ్య ఆయన్ను రోహ్‌తక్ తీసుకువెళ్లారు.
ఇద్దరు మహిళా శిష్యులపై అత్యాచారం, జర్నలిస్టు రామ్ చందర్ ఛత్రపతిని హత్య చేసిన ఆరోపణలపై డేరా బాబాకు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. పెరోల్‌లో ఉన్న సమయంలో శిష్యుల తాకిడి ఉండకుండా చూసేందుకు ఆయన ఉండే ప్రాంతాన్ని రహస్యంగా ఉంచారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
