ఇటీవలి కాలంలో పలు వార్తలతో ఢిల్లీ మెట్రో వార్తల్లో నిలుస్తోంది. చాలా మంది రైళ్లో రీల్స్, వీడియోలు చేస్తూ వైరల్ అవుతుండడంతో.. 'మీకు ఉచిత వినోదం కావాలంటే ఢిల్లీ మెట్రో ఎక్కండి' అని కొందరు సలహా ఇస్తున్నారు. భారత రాజధానిలోని రైళ్లు ద్వంద్వ ప్రయోజనాన్ని అందిస్తాయని, కేవలం ప్రయాణ సాధనంగా మాత్రమే కాకుండా, వివిధ రకాల వినోదాలకు వేదికగా నిలుస్తోందని అంటున్నారు. తాజాగా ఇద్దరు వ్యక్తులు మెట్రో ట్రైన్ లో భీకర ఫైట్ కు సంబంధించిన ఓ వీడియో ఆన్‌లైన్ లో సంచలనం సృష్టిస్తోంది.
ఈ వీడియో ఇద్దరు వ్యక్తుల మధ్య తీవ్ర ఘర్షణను ప్రదర్శించింది. ప్రతి ఒక్కరు WWE లో ఫైటర్లలా ఫీలై.. పంచ్‌లను విసరడం అందర్నీ ఆశ్చర్యానికి, ఒకింత భయానికి గురి చేసింగి. రైలు ప్రయాణంలో ముందుకు సాగుతుండగా, వారు కొట్టుకోవడంతో ఘర్షణ తీవ్రత పెరిగింది. వాగ్వివాదం వెనుక కారణాలు తెలియకపోవడంతో తోటి ప్రయాణికులు అయోమయంలో పడ్డారు. చూపరులలో, ఒక ధైర్యవంతుడు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఘర్షణను ఆపడానికి వారి మధ్యకు వెళ్లాడు. అయినప్పటికీ, వారు అలాగే ఆగకుండా ఒకరిపై ఒకరు పంచ్‌లు విసురుకున్నారు.
ఈ వీడియో వైరల్ కావడంతో.. ప్రేక్షకులకు వినోదం ఫ్రీ అని కొందరు, ఇది మామూలే అని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు.
@gharkekalesh pic.twitter.com/lFGVCrJung
— Arhant Shelby (@Arhantt_pvt) December 16, 2023
