అల్లు అర్జున్ ఇంటికి పరదాలు.. కనిపించకుండా మొత్తం కప్పేశారు

హీరో అల్లు అర్జున్ ఇంటికి పరదాలు కట్టారు.. జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంటిని పరదాలతో కప్పేశారు. ఇంట్లో వాళ్లు బయటకు కనిపించకుండా.. బయట వాళ్లు ఇంట్లో వాళ్లను చూడకుండా..  ఇంటి మొత్తాన్ని పరదాలతో కప్పేశారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ ను.. పోలీసులు విచారిస్తున్న సమయంలోనే.. అత్యంత వేగంగా.. చకచకా ఈ పనులు జరిగిపోయాయి. మొన్నటికి మొన్న అల్లు అర్జున్ ఇంటిపై కొందరు దాడి చేయటం.. ఆయన ఇంటిపై రాళ్లు, టమాటాలు విసిరివేయటం.. ఇంటి ఆవరణలోని పూల కుండీలను ధ్వంసం చేయటం తెలిసిందే..

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగిన నాలుగు రోజుల తర్వాత.. ఇప్పుడు పరదాలు కట్టటం ఆసక్తిగా మారింది. పోలీస్ స్టేషన్ లో పోలీస్ విచారణ జరుగుతున్న సమయంలోనే.. ఈ పరదాలు కట్టటం వెనక భద్రతా కారణాలు ఏమైనా ఉన్నాయా లేక మరేదైనా కారణం ఉందా అనే చర్చ నడుస్తుంది.

ALSO READ | అల్లు అర్జున్కు రెండున్నర గంటలు సినిమా చూపించిన పోలీసులు !

 అల్లు అర్జున్ ఇంటిపై ఇటవలే ఓయూ జేఏసీ నేతలు దాడి చేశారు. ఈ క్రమంలోనే సేఫ్టీ కోసం ఇంటిని పరదలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. 

అల్లు అర్జున్ ఇంటిపై దాడి

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో చనిపోయిన రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఓయూ జేఏసీ నేతలు డిసెంబర్ 22న అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేశారు. గోడ దూకి ఇంట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఇంటి ఆవరణలో ఉన్న పూల కుండ్లను పగులగొట్టారు. ఈ క్రమంలో వారిని అల్లు అర్జున్ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఓయూ జేఏసీ నేతలు బైరు నాగరాజు గౌడ్, రెడ్డి శ్రీను ముదిరాజ్, బోణాల నగేశ్ మాదిగ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్​లోని అల్లు అర్జున్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. రేవతి కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ కుటుంబానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఓయూ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.