ఎమ్మెల్యేను కలిసిన కాంగ్రెస్​ నాయకులు

నార్కట్​పల్లి, వెలుగు : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్​ నాయకులు కలిశారు. గురువారం నార్కట్​పల్లి మండలంలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఎమ్మెల్యేను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సన్మానించారు. ఎమ్మెల్యేను కలిసినవారిలో  కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఉషయ్య గౌడ్, నాయకులు వడ్డే భూపాల్ రెడ్డి, యల్లందల కిట్టు, చిక్కుల శివ, సూర అశోక్, మధుసూదన్ రెడ్డి తదితరులు ఉన్నారు.