స్కూళ్ల అభివృద్ధి పనులు స్పీడప్​ చేయాలి : కలెక్టర్ క్రాంతి

  • కలెక్టర్ క్రాంతి

సంగారెడ్డి టౌన్, వెలుగు: స్కూళ్ల అభివృద్ధి పనులు స్పీడప్​చేయాలని కలెక్టర్ క్రాంతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లాలోని గవర్నమెంట్ స్కూల్స్, గురుకులాలు, మోడల్ స్కూల్స్, కాలేజీలు, హాస్టళ్లలో మౌలిక వసతుల కల్పనపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి విద్యాసంస్థలో తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక అందించాలని ప్రభుత్వం చేపట్టిన వివరాలను సమర్పించాలని ఆదేశించారు. ఇంకా పూర్తికాని పనులను గుర్తించి నివేదికలు తయారు చేయాలన్నారు . 

నీటి సరఫరా, మరుగుదొడ్లు, విద్యుత్ సరఫరా వంటి అంశాలను పరిశీలించి వాటిని మెరుగుపరచాలని సూచించారు. హాస్టళ్లలో మెనూ ప్రకారం పోషకాహారం భోజన పెట్టాలని ఆదేశించారు. వసతి గృహాల్లో శుభ్రతను పరిశీలించాల్సిన బాధ్యత ఎంపీడీవో, జీపీ సెక్రటరీలకు ఉందన్నారు. సమావేశంలో అడిషనల్​కలెక్టర్ చంద్రశేఖర్, ట్రైనీ కలెక్టర్ మనోజ్, ఈఈపీఆర్​జగదీశ్, డీఈవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.