కీసర ఎమ్మార్వో ఆఫీస్ జూనియర్ అసిస్టెంట్ సస్పెండ్

మేడ్చల్ మల్కాజిగిరి: కల్యాణ లక్ష్మీ పథకం లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేశాడనని విచారణలో తేలడంతో కీసర ఎమ్మార్వో కార్యాలయంలో జూనియర్ అస్టిస్టెంట్ ను సస్పెండ్ చేశారు కలెక్టర్ గౌతమ్. ఇటీవల సీఎంరేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ ఈ విషయం ప్రస్తావన రావడంతో విచారణ చేపట్టాలని ఆదేశించగా ..జూనియర్ అసిస్టెంట్ డబ్బులు తీసుకున్నట్లు రుజువైంది దీంతో సస్పెండ చేశారు. 

కీసర ఎమ్మార్వో ఆఫీసులో జూనియర్ అస్టిసెంట్ గా పనిచేస్తున్న రమేష్.. కల్యాణలక్ష్మీ లబ్ధిదారులనుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లింది. వెంటనే విచారణ చేపట్టాలని కీసర ఆర్డీవోను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. 

విచారణ చేపట్టిన కీసర ఆర్డీవో.. కల్యాణ లక్ష్మీ లబ్ధాదారులనుంచి డబ్బులు వసూలు చేసినట్లు రుజువైంది.దీంతో మేడ్చల్ మల్కాజ్ గిరి కలెక్టర్.. రమేష్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  రమేష్ గతంలో కామారెడ్డిలో వీఆర్ ఏ గా పనిచేసి జూనియర్ అసిస్టెంట్ కన్వర్ట్ చేసి కీసర ఎమ్మార్వో కార్యాలయానికి పోస్టింగ్ ఇచ్చారు.