సింగరేణి బొగ్గు రవాణాకు సహకరించాలి

  • ఎస్సీఆర్ జీఎంను కోరిన సింగరేణి సీఎండీ 

హైదరాబాద్, వెలుగు: సింగరేణి బొగ్గు రవాణాకు సహకారం అందించాలని ఆ సంస్థ సీఎండీ ఎన్. బలరామ్.. దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) జీఎం అరుణ్ కుమార్ జైన్​ను కోరారు. శనివారం రైల్ నిలయంలో ఎస్సీఆర్ జీఎంను సింగరేణి సీఎండీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బలరామ్​ మాట్లాడుతూ.. సింగరేణి థర్మల్ ప్లాంట్లకు తగినంత బొగ్గు సరఫరా కోసం రోజుకు 40 రేక్ లు అవసరం ఉందని తెలిపారు. రాబోయే రోజుల్లో థర్మల్ కేంద్రాల్లో బొగ్గు డిమాండ్ పెరిగే అవకాశం ఉండటంతో బొగ్గు రవాణా సాఫీగా సాగేందుకు రేక్ లను అందుబాటులో ఉంచాలని కోరారు. 

దీనిపై ఎస్సీఆర్ రైల్వే జీఎం అరుణ్​ కుమార్ జైన్ సానుకూలంగా స్పందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశ ఇంధన అవసరాలను తీర్చడంలో సింగరేణి, ఎస్సీఆర్ ఎన్నో ఏండ్లుగా సమన్వయంతో సేవలు అందిస్తున్నాయని పేర్కొన్నారు.  ఇకపైనా డిమాండ్ కు అనుగుణంగా రేక్ లను పెంచడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో సింగరేణి జీఎం (మార్కెటింగ్) రవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.