ఫార్ములా ఈ కార్ రేసులో.. రూ. 600 కోట్లు నొక్కేయాలని చూశారు : సీఎం రేవంత్

 రూ. 600 కోట్లు లూటీ చేసేందుకే  ఫార్ములా ఈ కార్ రేసు తీసుకొచ్చారని  సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో ఫార్ములా ఈ కార్ రేస్ పై మాట్లాడిన రేవంత్ ..హెచ్ఎండీఏ నిధులు విదేశాలకు ఎలా వెళతాయని ప్రశ్నించారు. ఈ కార్ రేస్ సంస్థతో కేటీఆర్ లోపాయికారి ఒప్పందం జరిగిందన్నారు.  ఫార్ములా ఈ రేసింగ్ ప్రతినిధి తమను కలిశారు..FEO సంస్థ చెప్పిన తర్వాతే స్కాం బయటకు తీశామన్నారు రేవంత్. 

ఫార్ములా ఈ రేస్ కేసుపై  ఏసీబీ విచారణ జరుగుతుంది.. అందుకే పూర్తిగా మాట్లాడటం లేదన్నారు రేవంత్ రెడ్డి.  2023 డిసెంబర్.. 2024 డిసెంబర్.. వరకు ఏసీబీ విచరాణకు ముందు వివరాలు అన్ని త్వరలోనే బయట పెడతానని చెప్పారు రేవంత్. HMDA నిధులు విదేశాలకు ఎలా పోతాయన్నారు.

 నాలుగు సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి..  ఎప్పుడైనా బీఆర్ఎస్ ఫార్ములా ఈ రేస్ గురించి మాట్లాడిందా.. కేటీఆర్.. ట్విట్టర్ పిట్ట ఎప్పుడైనా స్పందించారా..సడెన్ గా గురువారం చర్చ పెట్టాలని రాద్ధాంతం చేయడం ఎందుకని ప్రశ్నించారు రేవంత్. ఈ కార్ రేసుపై అసెంబ్లీలో కాదు..బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులోనైనా చర్చకు రెడీ అని సవాల్ విసిరారు రేవంత్.