IND vs AUS: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కొత్త అవతారం.. పుజారాకు ఇలాంటి పరిస్థితి ఏంటి

భారత వెటరన్ ప్లేయర్ టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారాకు ఇకపై టీమిండియాలో కనిపించడం కష్టంగానే కనిపిస్తుంది. దశాబ్దకాలంగా భారత టెస్ట్ జట్టులో కీలక పాత్ర పోషించిన అతను ద్రవిడ్ వారసుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి దేశాలలో భారత్ సాధించిన విజయాల్లో పుజారా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. మూడో స్థానంలో పుజారా అడ్డుగోడలా నిలబడుతూ  నిలకడగా రాణించాడు. బాగా ఆడవుతూ టెస్టుల్లో వీరి స్థానం సుస్థిరం చేసుకున్నాడు.        

ప్రస్తుతం పుజారాకు గడ్డు కాలం నడుస్తుంది. అతను కంబ్యాక్ ఇవ్వడం కూడా కష్టంగానే కనిపిస్తుంది. ఇటీవలే ఆస్టేలియాలో జరగబోయే 5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ సిరీస్ కు ఎంపిక చేసిన 18 మంది స్క్వాడ్ లో పుజారాకు చోటు దక్కలేదు. దీంతో పుజారా కొత్త అవతారమెత్తాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం కామెంటేటర్ చేయనున్నాడు. ఈ సారి మైదానంలో కనిపించకుండా టెస్ట్ సిరీస్‌లో హిందీ కామెంటరీ ప్యానెల్‌ లో పాల్గొననున్నాడు. ఇది చూసిన ఫ్యాన్స్ విచారం వ్యక్తం చేస్తున్నారు. పుజారాకు ఎంపిక చేయకుండా అతనికి అన్యాయం చేశారని కామెంట్ చేస్తున్నారు. 

ఆస్ట్రేలియాలో భారత్ చివరి రెండు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలు గెలుచుకోవడంలో పుజారా కీలక పాత్ర పోషించాడు. 2023 దక్షిణాఫ్రికా టూర్‌ నుంచి పుజారాకు టెస్ట్ జట్టులో స్థానం దక్కడం లేదు. 2020 నుండి పుజారా ఫామ్ దిగజారుతూ వస్తుంది. గత నాలుగేళ్లలో ఈ వెటరన్ ప్లేయర్ 28 టెస్టు మ్యాచ్ లాడితే యావరేజ్ 30 కంటే తక్కువగానే ఉంది. కేవలం ఒకసారి మాత్రమే మూడంకెల స్కోర్ ను చేరుకోగలిగాడు. నిలకడగా రాణించలేకపోవడం పుజారాకు మైనస్ గా మారింది.