‘హైబ్రిడ్‌‌‌‌‌‌‌‌’కు ఓకే.. కానీ..ఇండియాలో జరిగే టోర్నీలకూ అనుసరించాలన్న పీసీబీ

కరాచీ : చాంపియన్స్‌‌‌‌‌‌‌‌ ట్రోఫీని హైబ్రిడ్‌‌‌‌‌‌‌‌ మోడల్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించేందుకు దాదాపుగా ఓకే చెప్పిన పాక్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌ బోర్డు (పీసీబీ) ఐసీసీ ముందు మరో కొత్త డిమాండ్‌‌‌‌‌‌‌‌ను ఉంచింది. 2031 వరకు ఇండియాలో జరిగే టోర్నీలకు కూడా ఇదే పద్ధతిని అనుసరించాలని అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. అలాగే రెవెన్యూలో ఎక్కువ భాగం ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. ‘భవిష్యత్‌‌‌‌‌‌‌‌లో జరిగే అన్ని ఐసీసీ ఈవెంట్లను ఇదే పద్ధతిలో నిర్వహిస్తేనే మేం హైబ్రిడ్‌‌‌‌‌‌‌‌ మోడల్‌‌‌‌‌‌‌‌కు ఒప్పుకుంటామని మోషిన్‌‌‌‌‌‌‌‌ నఖ్వీ స్పష్టం చేశారు.

రాబోయే రోజుల్లో ఏ ఈవెంట్‌‌‌‌‌‌‌‌ కోసం పాక్‌‌‌‌‌‌‌‌.. ఇండియాకు వెళ్లబోదు. తటస్థ వేదికల్లోనే మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు ఆడేలా ఐసీసీ ఒప్పించాలి’ అని పీసీబీ వర్గాలు తెలిపాయి. 2031 వరకు ఇండియాలో మూడు మేజర్‌‌‌‌‌‌‌‌ ఐసీసీ ఈవెంట్లు జరగనున్నాయి. 2026 టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌, 2029 చాంపియన్స్‌‌‌‌‌‌‌‌ ట్రోఫీ, 2031 వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ ఇందులో ఉన్నాయి. ఇందులో టీ20, వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్స్‌‌‌‌‌‌‌‌కు శ్రీలంక, బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌ కో హోస్ట్‌‌‌‌‌‌‌‌లుగా ఉన్నాయి. కాబట్టి వాటికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. 

కేవలం 2029 చాంపియన్స్‌‌‌‌‌‌‌‌ ట్రోఫీ మాత్రమే ఇండియాలో ఉంటుంది. అలాగే వచ్చే ఏడాది విమెన్స్‌‌‌‌‌‌‌‌ వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌కు కూడా ఇండియా ఆతిథ్యమిస్తున్నది. ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా పాక్‌‌‌‌‌‌‌‌ తాజా డిమాండ్లపై చర్చించిన తర్వాత రాబోయే రెండు రోజుల్లో ఐసీసీ చాంపియన్స్‌‌‌‌‌‌‌‌ ట్రోఫీపై తుది నిర్ణయం తీసుకోనుంది.