జూలై 31 లోగా సీబీఎస్ఈ రిజల్ట్

 జూలై 31 లోగా సీబీఎస్ఈ రిజల్ట్

CBSE - 12వ తరగతి పరీక్ష ఫలితాలను జూలై 31వ తేదీలోగా వెల్లడిస్తామని కేంద్రం తెలిపింది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు వివరించారు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్. 12వ తరగతి ఫలితాల విడుదలకు అనుసరించే ప్రణాళికను కోర్టుకు సమర్పించింది CBSE బోర్డు. 10వ తరగతిలో ప్రతిభకు 30 శాతం, 11వ తరగతిలో ప్రతిభకు 30 శాతం, 12వ తరగతతి ప్రీ బోర్డు ఫలితాలకు 40 శాతం వెయిటేజీ ఇస్తామని జస్టిస్ ఏఎం ఖాన్ విల్కర్ , జస్టిస్ దినేశ్ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనానికి వివరించింది. CBSE ఇచ్చిన మార్క్ లతో సంతృప్తి చెందని విద్యార్థులు కరోనా అదుపులోకి వచ్చాక పరీక్షలు రాసుకోవచ్చన్నారు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్. 

మార్కుల ప్రణాళికను 13 మంది నిపుణులతో కూడిన కమిటీ  సిపార్స్ చేసిందని సుప్రీంకోర్టుకు CBSE తెలిపింది. 1929 నుంచి బోర్డు ఉన్నా ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురు కాలేదని వివరించింది. మార్కులపై అభ్యంతరాలుంటే పరిష్కరించే మెకానిజం ఉండాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించిది. గతేడాది చాలా మంది మార్కులపై అభ్యంతరాలు చెబుతూ కోర్టును ఆశ్రయించారని గుర్తుచేసింది. దీంతో మార్కులపై అభ్యంతరాలు వినేందుకు కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు అటార్నీ జనరల్ వేణుగోపాల్.