డిసెంబర్ 25నుంచి వాజ్​పేయి శతజయంతి ఉత్సవాలు : కాసం వెంకటేశ్వర్లు

హైదరాబాద్, వెలుగు: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి శతజయంతి ఉత్సవాలను ఈ నెల 25 నుంచి ఏడాది పాటు నిర్వహించనున్నట్టు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా సమాజ సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.  సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. 

ఈ నెల 24న బీజేపీ ఆఫీసులో వాజ్ పేయి జీవిత చరిత్రకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడె సుధాన్షు త్రివేది ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఈ నెల 25న రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలింగ్ బూతుల్లో వాజ్ పేయి చిత్రపటానికి నివాళులర్పించనున్నట్టు వివరించారు.